Home » NTR District
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. ఇప్పటికే అనేక ఆరోపణలతో వివాదాస్పదమైన ఆయన.. అలవాల రమేష్ రెడ్డిపై విమర్శలు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై గిరిజన యువకులు, మహిళలు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రమేష్ రెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు తిరుణాలలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అడ్డుకున్న పోలీసు సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సంఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. ఈ దాడి ఘటనకు కారణమైన వారందరిపై కేసులు నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు హోంమంత్రి ఆదేశించారు.
పెనుగంచిప్రోలులక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాలలో తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్‌సీపీ నేతల ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రెచ్చిపోయి కవ్వింపు చర్యలకు దిగారు. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఈ దాడిలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా గాయపడ్డారు.
NTPS Accident: ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్టీపీఎస్‌లోఈ ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరోకార్మికుడి పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఈఘటనతో ఫ్యాక్టరీలోని కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Andhrapradesh: ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ పోలీసులనే ఖంగుతినేలా చేసింది. ఆ ఇంట్లో దొంగతనం చేసే సమయంలో దొంగల ప్రవర్తించిన తీరుపై ఆశ్చర్యపోయారు పోలీసులు.
బర్డ్‌ఫ్లూ లక్షణాలతో 3 వేల కోళ్లు మృత్యువాతపడటం కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
పట్టపగలే వాహనాలను ఎత్తుకుపోయేవారు కూడా పెరిగిపోతున్నారు. కొందరు దొంగలైతే ఏకంగా బస్సు, లారీలను కూడా ఎత్తుకుపోవడం చూస్తున్నాం. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది..
స్నేహం పేరుతో ఓ యువకుడు యువతికి దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. అదును చూసి.. ఆ యువతిని అత్యాచారం చేసి.. ఆపై నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులకు దిగారు. వారి వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Nandigama Municipal Chairman: నందిగామ మున్సిపల్ చైర్మన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో కృష్ణకుమారికి మద్దతుగా ఎమ్మెల్యే, ఇతర సభ్యులు ఓటేశారు. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన కృష్ణకుమారికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు.
నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలో ట్విస్ట్.. సోమవారం నుంచి దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న శాకమూరి స్వర్ణలతకు టీడీపీ హై కమాండ్ బీ ఫారం పంపించింది. అయితే ఆ పేరును తాము అంగీకరించబోమని ఎమ్మెల్యే సౌమ్య కౌన్సిలర్లను పక్కను పెట్టుకుని సమావేశానికి రాలేదు.