• Home » Notice

Notice

TG Govt.: లగచర్లలో భూ సేకరణ కోసం మరో నోటిఫికేషన్..

TG Govt.: లగచర్లలో భూ సేకరణ కోసం మరో నోటిఫికేషన్..

లగచర్లలో భూ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. లగుచర్ల, పోలేపల్లి, హకీంపేట పరిధిలో ఫార్మా విలేజ్ స్థానంలో మల్టిపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సర్కార్ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమిని సమీకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలియజేసింది.

Supreme Court: వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

Supreme Court: వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. దాదాపు హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. ఈ హత్య చేసిందేవరో కోర్టు తుది తీర్పు తర్వాతనే తేలనుంది. సీబీఐ సుదీర్ఘకాలంగా కేసును విచారిస్తోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ కేసు విచారణలో స్పీడ్ తగ్గింది.

Actor Ali: సినీ నటుడు అలీకి నోటీసులు

Actor Ali: సినీ నటుడు అలీకి నోటీసులు

సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండలంలోని ఎక్‌ మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో అలీకి భూమి, ఫామ్‌హౌస్‌ ఉంది. అందులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు నోటీసు ఇచ్చారు.

RGV: విచారణకు రాలేను.. వారం రోజుల గడువు కావాలి: రాంగోపాల్ వర్మ

RGV: విచారణకు రాలేను.. వారం రోజుల గడువు కావాలి: రాంగోపాల్ వర్మ

పోలీసులు తనకిచ్చిన నోటీసులపై డైరక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. ప్రస్తుతం తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, విచారణకు సహకరిస్తానని, వారం రోజుల గడువు కావాలని కోరుతూ మద్దిపాడు పోలీసులకు ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టారు.

Election Commission: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై బీజేపీ, కాంగ్రెస్‌ చీఫ్‌లకు ఈసీ నోటీసు

Election Commission: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై బీజేపీ, కాంగ్రెస్‌ చీఫ్‌లకు ఈసీ నోటీసు

జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు నవంబర్ 11న బీజేపీ ఫిర్యాదు చేసినట్టు ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ తెలిపింది. ఇదే తరహాలో నడ్డాకు కూడా ఈసీ లేఖ రాసింది.

TG News: సింగర్‌కు తెలంగాణ సర్కార్ నోటీసు

TG News: సింగర్‌కు తెలంగాణ సర్కార్ నోటీసు

పంజాబీ సింగర్ దిల్జిత్ సింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఈ రోజు దిల్జిత్ కాన్సర్ట్ ఉంది. ఇటీవల ఢిల్లీ జేఎన్‌యూలో జరిగిన కాన్సర్ట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మద్యం, డ్రగ్స్, హింసను ప్రేరేపించేలా పాటలు పాడారు. హైదరాబాద్‌లో జరిగే కాన్సర్ట్ ఆ విధంగా జరుగుతుందోనని భావించి చండీగఢ్‌కు చెందిన ప్రొఫెసర్ తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

MUDA Case: సీఎంకు హైకోర్టు నోటీసు

MUDA Case: సీఎంకు హైకోర్టు నోటీసు

స్నేహమయి కృష్ణ వేసిన ఈ పిటిషన్‌పై కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, లోకాయుక్త పోలీసులకు హైకోర్టు నోటీసులు పంపింది. లోకాయుక్త పోలీసులు ఇంతవరకూ చేసిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను నవంబర్ 25వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా కోర్టు కోరింది.

Ts News: హాజరుకాకుంటే అరెస్ట్ తప్పదని హెచ్చరికలు

Ts News: హాజరుకాకుంటే అరెస్ట్ తప్పదని హెచ్చరికలు

మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం తమ ముందు హాజరు కావాలన్నారు. అడ్రస్ ప్రూప్‌లతోపాటు, కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.

TDP Police: దివ్వెల మాధురి తిరుమల పొలీసుల నోటీసులు..

TDP Police: దివ్వెల మాధురి తిరుమల పొలీసుల నోటీసులు..

వారం రోజుల క్రితం వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివా‌స్, అతని సన్నిహితురాలు దివ్వెల మాధురిపై తిరుమల వన్‌టౌన్‌ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 7న దువ్వాడతో కలసి తిరుమల వచ్చిన ఆమె మాడవీధుల్లో, పుష్కరిణి వద్ద వీడియోలు చేస్తూ హల్‌చల్‌ చేశారు. తాము సహజీవనంలో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకుంటామని తిరుమలలో మాధురి వ్యక్తిగత విషయాలు మాట్లాడటం వివాదాస్పదమైంది.

Medical Health: వైద్య శాఖలో కొలువుల మేళా

Medical Health: వైద్య శాఖలో కొలువుల మేళా

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల మేళా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7300 పోస్టులను భర్తీ చేసింది. మరో 6500 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి