• Home » Notice

Notice

Ranveer Allahbadia Controversy: రాఖీ సావంత్‌కు మహారాష్ట్ర పోలీసులు సమన్లు

Ranveer Allahbadia Controversy: రాఖీ సావంత్‌కు మహారాష్ట్ర పోలీసులు సమన్లు

రాఖీసావంత్ గత ఏడాది అక్టోబర్‌లో "ఇండియా గాట్ లాటెంట్''షోలో పాల్గొన్నారు. ఆ షోలో కో-జడ్జి మహీప్ సింగ్‌, రాఖీ సావంత్ మధ్య వాగ్వాదం చాలా తీవ్ర స్థాయిలో చోటుచేసుకుంది. ఓ దశలో రాఖీ సావంత్ వేదికపై ఉన్న కూర్చీని విరిసికొట్టారు.

ACB Notice to Kejriwal: కేజ్రీవాల్‌కు 5 ప్రశ్నలతో ఏసీబీ నోటీసు

ACB Notice to Kejriwal: కేజ్రీవాల్‌కు 5 ప్రశ్నలతో ఏసీబీ నోటీసు

ఆప్ చేసిన ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారంనాడు అదేశించారు. దీంతో ఏసీబీ అధికారులు ఫిరోజ్‌షా రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అయితే, నోటీసు లేకుండా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆప్ నేతలు ఏసీబీ అధికారులను లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

Sonia Gandhi: సోనియాగాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

Sonia Gandhi: సోనియాగాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

సోనియాగాంధీ వ్యాఖ్యలు గిరిజన వ్యతిరేక భావజాలంతో కూడుకున్నాయని ఎంపీలు ఆరోపించారు. పార్లమెంటు పవిత్రత, నిబంధనల పరిరక్షణకు, ప్రజాస్వామ్య సంస్థలు సమర్ధవంతంగా పనిచేసేందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరారు.

High Court: మాజీ మంత్రికి హైకోర్టు నోటీసు

High Court: మాజీ మంత్రికి హైకోర్టు నోటీసు

అన్నాడీఎంకే నేత, మాజీమంత్రి రాజేంద్రబాలాజీ(Former Minister Rajendra Balaji)కి మద్రాస్‌ హైకోర్టు నోటీసులిచ్చింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో పాడి పరిశ్రమల శాఖా మంత్రిగా వ్యవహరించిన రాజేంద్రబాలాజీ, అన్నాడీఎంకే నాయకుడు విజయ నల్లతంబి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని నమ్మించి నగదు మోసానికి పాల్పడినట్లు విరుదునగర్‌(Virudu Nagar) జిల్లా ఆర్థిక నేరవిభాగంలో రవీంద్రన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

Notices: పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి నోటీసులు

Notices: పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి నోటీసులు

రేషన్ బియ్యం మాయం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే పోలీసులు నోటీసులు ఇచ్చే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు.

Lookout Notice: పేర్ని నాని భార్య జయసుధపై లుకౌట్ నోటీసు..

Lookout Notice: పేర్ని నాని భార్య జయసుధపై లుకౌట్ నోటీసు..

10 రోజులుగా పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. కేసు దర్యాప్తుగా సహకరించాల్సిందిగా ఆదివారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఇంతవరకు పేర్ని నాని కుటుంబం స్పందించకపోవడంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Privilege Notice: ముసుగు తొలగింది.. అమిత్‌షాపై టీఎంసీ ప్రివిలిజ్ నోటీస్

Privilege Notice: ముసుగు తొలగింది.. అమిత్‌షాపై టీఎంసీ ప్రివిలిజ్ నోటీస్

భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభలో మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్‌షా మాట్లాడుతూ, అంబేడ్కర్ పేరు పదేపదే ప్రస్తావించడం విపక్షనేతలకు ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారిందని అన్నారు.

Lookout Notices: ఎంపీ విజయసాయి రెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు

Lookout Notices: ఎంపీ విజయసాయి రెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు

అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయనతోపాటు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని శరత్ చంద్ర రెడ్డి‌పై ఎల్వోసీ ఇచ్చింది. ఈ ముగ్గురు విదేశాలకు పారిపోకుండా దేశంలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు ఎల్వోసీలు పంపినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

YSRCP: జగన్ రెడ్డి సొంత బంధువుల్లో నోటీసుల కలకలం..

YSRCP: జగన్ రెడ్డి సొంత బంధువుల్లో నోటీసుల కలకలం..

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా పోస్టుల కేసులో పులివెందుల పోలీసులు వేగం పెంచారు. 74 మందిని గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులోఇప్పటికే వర్ర రవీందర్ రెడ్డితో పాటు ముగ్గురు అరెస్టయ్యారు. పులివెందుల డీఎస్పీ కార్యా లంయంలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వరుసగా విచారణకు హాజరవుతున్నారు.

TG Govt.: లగచర్లలో భూ సేకరణ కోసం మరో నోటిఫికేషన్..

TG Govt.: లగచర్లలో భూ సేకరణ కోసం మరో నోటిఫికేషన్..

లగచర్లలో భూ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. లగుచర్ల, పోలేపల్లి, హకీంపేట పరిధిలో ఫార్మా విలేజ్ స్థానంలో మల్టిపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సర్కార్ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమిని సమీకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలియజేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి