Home » Notice
ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినబాద్ పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలంటూ మాదాపూర్‌లో ఉంటున్న ఆయన ఇంటికి పోలీసులు ఈ మేరకు నోటిసులు అంటించారు.
ధర్మేంద్ర ప్రధాన్‌పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు ఇస్తూ, ఎన్‌ఈపీపై డీఎంకే ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. స్కూల్ ఎడ్యుకేషన్‌కు నిధులను ఎన్‌ఈపీ అమలుతో కేంద్రం ముడిపెట్టరాదని, ఈ విషయంలో తమ (డీఎంకే) వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మంత్రి రాజీనామా వ్యవహారాన్ని సభ మందుకు తీసుకురావాల్సి ఉండగా సీఎం అందుకు భిన్నంగా వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపించింది. రాజీనామాపై సీఎం తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు సభ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుందని తెలిపింది.
మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్ క్రైం పోలీసుల నుంచి ‘ఆహ్వానం’ అందింది. పోక్సో కేసు బాధితుల వివరాలను మీడియా సమావేశంలో బహిరంగపరిచినందుకు ఆయనపై గత ఏడాది నవంబరు 2న కేసు నమోదైంది. వైసీపీ హయాంలో రాష్ట్ర మహిళా కమిషన చైర్‌పర్సనగా పనిచేసి, ఆ తరువాత పార్టీని వీడిన వాసిరెడ్డి పద్మ ఆయనపై ఫిర్యాదు చేశారు. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషనలో భారతీయ నాగరిక్ సురక్షితా సంహిత ...
రాఖీసావంత్ గత ఏడాది అక్టోబర్‌లో "ఇండియా గాట్ లాటెంట్''షోలో పాల్గొన్నారు. ఆ షోలో కో-జడ్జి మహీప్ సింగ్, రాఖీ సావంత్ మధ్య వాగ్వాదం చాలా తీవ్ర స్థాయిలో చోటుచేసుకుంది. ఓ దశలో రాఖీ సావంత్ వేదికపై ఉన్న కూర్చీని విరిసికొట్టారు.
ఆప్ చేసిన ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారంనాడు అదేశించారు. దీంతో ఏసీబీ అధికారులు ఫిరోజ్‌షా రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అయితే, నోటీసు లేకుండా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆప్ నేతలు ఏసీబీ అధికారులను లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
సోనియాగాంధీ వ్యాఖ్యలు గిరిజన వ్యతిరేక భావజాలంతో కూడుకున్నాయని ఎంపీలు ఆరోపించారు. పార్లమెంటు పవిత్రత, నిబంధనల పరిరక్షణకు, ప్రజాస్వామ్య సంస్థలు సమర్ధవంతంగా పనిచేసేందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరారు.
అన్నాడీఎంకే నేత, మాజీమంత్రి రాజేంద్రబాలాజీ(Former Minister Rajendra Balaji)కి మద్రాస్ హైకోర్టు నోటీసులిచ్చింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో పాడి పరిశ్రమల శాఖా మంత్రిగా వ్యవహరించిన రాజేంద్రబాలాజీ, అన్నాడీఎంకే నాయకుడు విజయ నల్లతంబి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని నమ్మించి నగదు మోసానికి పాల్పడినట్లు విరుదునగర్(Virudu Nagar) జిల్లా ఆర్థిక నేరవిభాగంలో రవీంద్రన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
రేషన్ బియ్యం మాయం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే పోలీసులు నోటీసులు ఇచ్చే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు.
10 రోజులుగా పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. కేసు దర్యాప్తుగా సహకరించాల్సిందిగా ఆదివారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఇంతవరకు పేర్ని నాని కుటుంబం స్పందించకపోవడంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.