Home » Nominations
సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరణపై సస్పెన్స్ వీడింది. సూర్యాపేటలో పోటీ నుంచి తప్పుకునేందుకు పటేల్ రమేష్‌రెడ్డి అంగీకారం తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఎట్టకేలకు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి బుజ్జగింపులు ఫలించాయి.
Telangana Elections: సూర్యాపేటలోని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో రెండు గంటలకు పైగా సీనియర్ కాంగ్రెస్ నేతల బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. భవిష్యత్‌పై అధిష్టానం నుంచి హామీలు ఇచ్చేలా ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Nomination Day : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులకు ఇక కొన్ని గంటలు మాత్రమే మిగిలుంది. శుక్రవారం నాడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. అయితే గురువారం మంచి రోజు కావడంతో నామినేషన్లు వేయడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలంతా క్యూ కట్టారు...