Home » Nominations
Andhrapradesh: గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అలాగే రేపు విశాఖలో నామినేషన్లు వేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే... తాను సీఎం అవుతానన్నారు. విశాఖను వాషింగ్టన్ డీసీగా..ఆంధ్రను అమెరికా చేసే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు. మూడు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరికొద్దిరోజులే సమయం ఉంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈసారి గెలుపు తమదే అంటూ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఏపీలో ఈసారి ఎవరికి అధికారం దక్కనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా ఏపీలో రేపటి (గురువారం) నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి బుధవారంనాడు నామినేషన్ వేశారు. ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్న ఆయన తిరిగి ఇదే నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. నామినేషన్ సందర్భంగా ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హాజరయ్యారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్ సభ సమరానికి సిద్ధం అయ్యారు. బుధవారం ఆయన కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి తన నామినేషన్‌ని దాఖలు చేయనున్నారు. ఇది ఆయన ఎన్నికల ప్రయాణంలో కీలకమైన ముందడుగు. నామినేషన్ సమర్పణకు ముందు రాహుల్.. కల్పేట పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహిస్తారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏడు దశల్లో జరగనుంది. మొదటి దశలో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ (Lok Sabha) స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈరోజుతో ముగుస్తుంది. బీహార్(BIHAR)లో మాత్రం నామినేషన్ల గడువు రేపటితో ముగుస్తుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌కి చెందిన వినయ్ చక్రవర్తి లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం నామినేషన్ ఫారమ్‌ని పొందేందుకు కలెక్టరేట్‌కి వెళ్లారు. రూ.25 వేలను కాయిన్స్ రూపంలో డిపాజిట్ చేశాడు. ఆయన పనికి కలెక్టరేట్ సిబ్బంది షాక్‌కి గురయ్యారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు పోటీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నామినేషన్ పత్రాలను మంగళవారంనాడు ఆయన దాఖలు చేశారు. ఎన్డీయేకు చెందిన పలువురు సీనియర్ నేతలు నితీష్ వెంట ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు బుధవారంనాడు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజ్యసభకు నామినేషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పాకిస్తాన్ నేషనల్ ఎలక్షన్స్‌లో పోటీ చేయాలనుకున్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆశలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన దాఖలు చేసిన రెండు నామినేషన్లను తిరస్కరించింది.
తెలంగాణలో నేటితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులను బుజ్జగించడంలో ఆ పార్టీ అధిష్టానం సక్సెస్ అయ్యింది. ఎట్టకేలకు రెబల్ నేతలను హస్తం పార్టీ దారిలోకి తెచ్చుకుంది.