Home » Nizamababad
Telangana: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్‌ను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఈరోజు కోర్టుకు సెలవు కావడంతో మెహదీపట్నంలోని జడ్జి ఇంట్లో నరేందర్‌ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జడ్జి ముందుకు నరేందర్‌ను తీసుకెళ్లనున్నారు.
నగరపాలక సంస్థ సూపరింటెండెంట్, ఇన్‌ఛార్జి రెవెన్యూ అధికారి నరేందర్‌పై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుడు నరేందర్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు అధికారులు తరలించారు. అనంతరం ఇవాళ అతని బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు.
నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాదాపు రూ.3కోట్ల నగదు(2,93,81,000)ను స్వాధీనం చేసుకున్నారు.
జక్రాన్‌పల్లి(Jakranpally) మండలం అర్గుల్(Argul) గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడం, అప్పులబాధతో యువరైతు రాజేశ్(Farmer Rajesh) ఆత్మహత్య చేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ... అర్హులైన తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని ఆయా ప్రాంతాల రైతులు సోమవారం బ్యాంకుల ముందు ఆందోళనకు దిగారు.
నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఆదివారం నాడు అన్నం వడ్డించారు. అయితే ఈ సమయంలో కారం పొడితో భోజనం పెట్టినట్లు ప్రచారం జరిగింది. పాఠశాలలో జరిగిన ఘటన వివాదాన్ని రేపింది.
Telangana: ఎంతో కాలంగా రైతులు ఎదురు చూస్తున్న రుణమాఫీ ఈరోజు సాయంత్రానికి ప్రారంభంకానుంది. దాదాపు లక్ష వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఈ సందర్భంగా మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణాలు మాఫీ చేయడంఅభినందనీయమన్నారు.
ఇంటి బువ్వ తిని ఎన్నాళైందో నాతల్లీ అంటూ.. కూతురికి నోరారా అన్నం తినిపిస్తున్న అమ్మ ఒకరు... ఇంటికి దూరంగా ఉంటూ చదువు సాగిస్తున్న మనుమరాలిని చూసి ఆమె ముచ్చట్లు వింటున్న అమ్మమ్మ మరొకరు..
కామారెడ్డి జిల్లా: పల్వంచ మండలం, భవానిపేట గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యక్తి సైబర్ వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సైబర్ కేటుగాళ్లు వెంకట్ రెడ్డికి ఫోన్ చేశారు. అమెరికాలో ఉంటున్న మీ కుమార్తె మాధవి ఆపదలో ఉందని.. బెదిరింపు కాల్ చేశారు. ఆమె ఉంటున్న గదిలో మరో అమ్మాయి హత్యకు గురైందంటూ ఈ కేసు నుంచి మీ కూతురును తప్పించాలంటే రెండు లక్షలు ఖర్చవుతుందని, డబ్బులు పంపాలంటూ ఫోన్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేత డీఎస్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన సామాన్య కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు ఎదిగారని, కష్టపడి పని చేశారని చెప్పారు. ధర్మపురి శ్రీనివాస్ మరణంతో కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయినట్లందన్నారు.