• Home » Nitish Kumar

Nitish Kumar

Bihar politics: రాజీనామాకు నితీష్ రెడీ.. మళ్లీ సీఎంగా ప్రమాణం ఎప్పుడంటే..?

Bihar politics: రాజీనామాకు నితీష్ రెడీ.. మళ్లీ సీఎంగా ప్రమాణం ఎప్పుడంటే..?

పాట్నా: బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. 'మహాఘట్బంధన్'కు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ గుడ్‌బై చెప్పడం ఖాయమైంది. ముఖ్యమంత్రి పదవికి నితీష్ శనివారం పొద్దుపోయేలోగా రాజీనామా చేయనున్నారని, ఆదివారంనాడే సీఎంగా తిరిగి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది.

Bihar Politics: క్షణక్షణం ఉత్కంఠ.. మంతనాల్లో పార్టీలు తలమునకలు

Bihar Politics: క్షణక్షణం ఉత్కంఠ.. మంతనాల్లో పార్టీలు తలమునకలు

బీహార్‌ రాజకీయాల్లో తలెత్తిన సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి, బీజేపీతో కలిసి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వ్యూహరచన చేస్తుండగా, నితీష్‌ను అక్కున చేర్చుకునేందుకు బీజేపీ అధిష్ఠానం హస్తినలో పావులు కదుపుతోంది. ఇదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై ఆర్జేడీ సైతం వరుస సమావేశాలు జరుపుతోంది.

Delhi: బిహార్ రాజకీయ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

Delhi: బిహార్ రాజకీయ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

బిహార్(Bihar Politics) రాజకీయ పరిస్థితులను కేంద్ర బీజేపీ(BJP) నాయకత్వం అనుక్షణం పర్యవేక్షిస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ నేతలు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారన్నారు.

Delhi: హాట్.. హాట్‌గా బిహార్ రాజకీయాలు.. అమిత్ షా నివాసంలో కీలక సమావేశం

Delhi: హాట్.. హాట్‌గా బిహార్ రాజకీయాలు.. అమిత్ షా నివాసంలో కీలక సమావేశం

బిహార్ రాజకీయాలు(Bihar Politics) సీఎం నితీశ్ కుమార్(CM Nitish Kumar) చుట్టే తిరుగుతున్నాయి. ఆయన తన పదవికి రాజీనామా చేసి.. జేడీయూ, బీజేపీ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ఊహాగానాల నడుమ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Bihar: బిహార్‌‌లో హీటెక్కిన రాజకీయాలు.. నేడు సీఎం పదవికి నితీశ్ రాజీనామా!

Bihar: బిహార్‌‌లో హీటెక్కిన రాజకీయాలు.. నేడు సీఎం పదవికి నితీశ్ రాజీనామా!

బిహార్ రాజకీయాలు(Bihar Politics) రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తారని, ఆ వెంటనే బీజేపీ(BJP)తో కూడిన కూటమితో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.

Bihar: బిహార్‌లో భారీగా బ్యూరోక్రాట్ల బదిలీలు..  కొత్త ప్రభుత్వ ఊహాగానాల వేళ కీలక పరిణామం

Bihar: బిహార్‌లో భారీగా బ్యూరోక్రాట్ల బదిలీలు.. కొత్త ప్రభుత్వ ఊహాగానాల వేళ కీలక పరిణామం

ఓ వైపు బీజేపీ(BJP)తో బిహార్(Bihar) ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ చేతులు కలుపుతారన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 79 మంది ఐపీఎస్, 45 మంది బిహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులను బదిలీ చేశారు.

Bihar Crisis: నితీష్ రాజీనామా ఖాయమే.. ఎప్పుడంటే..?

Bihar Crisis: నితీష్ రాజీనామా ఖాయమే.. ఎప్పుడంటే..?

లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్‌లోని అధికార 'మహాఘట్బంధన్'లో తలెత్తిన సంక్షోభం కీలకమలుపు తిరిగే అవకాశాలున్నాయి. మహాకూటమిలోని ఆర్జేడీతో తెగతెంపులు చేసుకునేందుకే జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ దృఢ నిశ్చయంతో ఉన్నారని, బీజేపీ మద్దతుతో సీఎంగా కొనసాగేందుకు ఆయన మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి ఆయన శనివారంనాడు రాజీనామా చేసే అవకాశాలున్నట్టు బలంగా వినిపిస్తోంది.

Akhilesh Yadav: 'ఇండియా' కూటిమిలోనే నితీష్ ఉంటే పీఎం ఛాన్స్..

Akhilesh Yadav: 'ఇండియా' కూటిమిలోనే నితీష్ ఉంటే పీఎం ఛాన్స్..

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరే అవకాశాలున్నాయంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విభిన్నంగా స్పందించారు. 'ఇండియా' కూటమిలోనే నితీష్ ఉంటే ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థి కావొచ్చని వ్యాఖ్యానించారు.

Nitish Kumar: గవర్నర్ తేనేటి విందుకు తేజస్వి గైర్హాజర్‌.. నితీష్ స్పందన ఏమిటో తెలుసా?

Nitish Kumar: గవర్నర్ తేనేటి విందుకు తేజస్వి గైర్హాజర్‌.. నితీష్ స్పందన ఏమిటో తెలుసా?

బీహార్ సీఎం నితీష్ కుమార్ 'మహాఘట్బంధన్'కు ఉద్వాసన చెప్పి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరనున్నారనే ఊహాగానాల మధ్య మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఏర్పాటు చేసిన తేనేటి విందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ గైర్హాజరయ్యారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు నితీష్ నర్మగర్భంగా సమాధానమిచ్చారు. ''ఎవరైతే రాలేదే వారినే అడగండి...'' అంటూ సూటి సమాధానం దాటవేశారు.

Bihar Crisis: ఏ తలుపులూ ఎల్లకాలం మూసుండవు.. నితీష్ రాకపై బీజేపీ

Bihar Crisis: ఏ తలుపులూ ఎల్లకాలం మూసుండవు.. నితీష్ రాకపై బీజేపీ

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి బీజేపీతో చేతులు కలిపనున్నారనే బలమైన ఊహాగానాల నేపథ్యంలో కమలనాథులు సైతం సానుకూల సంకేతాలు పంపుతున్నారు. నితీష్‌కు తలుపులు మూసేసామంటూ కొద్దికాలం క్రితం ప్రకటించిన బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ శుక్రవారంనాడు తన మాట సవరించుకున్నారు. అవసరమైతే తలుపులు తెరుస్తామని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి