Home » Nirmala Sitharaman
Budget 2024: కేంద్ర బడ్జెట్2024-25లో ఉపాధి, నైపుణ్యం, MSMEలు (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్), మధ్యతరగతి ప్రజలుపై ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మంగళవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. ఈ క్రమంలో ముద్రా రుణాన్ని ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఉపాధి కల్పనే లక్ష్యంగా బడ్జెట్ 2024-25లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉపాధి కల్పనే లక్ష్యంగా 3 ప్రోత్సాహక పథకాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కేంద్ర బడ్జెట్ 2024-25ను లోక్‌సభకు సమర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. వరుసగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన వ్యక్తిగా ఆమె నిలిచారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను(budget 2024-25) సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో రైతులు, యువత కోసం ఈ బడ్జెట్‌లో భారీ ప్రకటనలు చేశారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి(agriculture sector) రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు.
నిన్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా, ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) లోక్‌సభలో మోడీ 3.0 మొదటి సాధారణ బడ్జెట్(Budget 2024-25)ను సమర్పించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వరుసగా ఏడోసారి పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి ఈ రోజు (మంగళవారం) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజున ఆర్థిక మంత్రులు ధరించే దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. అనాది కాలంగా ఈ ప్రాధాన్యత కొనసాగుతోంది.
యావత్ దేశం ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2024-25 వేళైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా 7వ సారి కేంద్రం పద్దును పార్లమెంట్ ముందు ఉంచబోతున్నారు. లోక్‌సభలో ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగం మొదలుపెడతారు.
మరికొన్ని గంటల్లో కేంద్రప్రభుత్వం 2024-25కి సంబంధించి పూర్తిస్థాయి భారతదేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దేశం మొత్తం బడ్జెట్ వైపు చూస్తోంది. సరిగ్గా 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.