Home » Nimmala Rama Naidu
అమ్మకు వందనం (Ammaku vandanam) పథకంపై వైసీపీ, నీలి మీడియా అబద్దపు ప్రచారాలు చేస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రెస్ కౌన్సిల్(Press Council)కు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి జగన్ రెడ్డి అని, ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నిమ్మల చెప్పుకొచ్చారు.
Andhrapradesh: వైసీపీలా కాకుండా ఎలాంటి కోతలు లేకుండా ‘‘తల్లికి వందనం’’ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ విద్యార్థికి రూ.15 వేలు తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామన్నారు.
అబద్ధాలు, అసత్యాలకు వైఎస్సార్‌సీపీ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) విమర్శించారు.
Andhrapradesh: నీరు లేకపోతే ప్రాణం నిలవదని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. త్రాగునీటిని నిర్లక్ష్యం చేసింది మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. కొత్త ఆయకట్టుకు కూడా సాగు నీరు ఇచ్చి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
విజయవాడ: ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం గోదావరి, కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దీక్ష, దక్షతకు, సీఎం చంద్రబాబు ముందుచూపుకు పట్టిసీమ నిదర్శనమని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా కరవు నిర్మూలించవచ్చని కెయల్ రావు చెప్పారని, దానిని అమలు చేసి రైతులకు నీరు ఇచ్చిన నేత చంద్రబాబు అని కొనియాడారు.
గత ప్రభుత్వ హయాంలో జగన్ టిడ్కో గృహాలను ఆరువేల కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి ఆ నిధులను దారి మళ్లించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
Andhrapradesh: తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం నాడు తాను చదివిన పూర్వ పాఠశాలను సందర్శించిన మంత్రి.. విద్యార్థులకు కిట్స్ అందజేశారు. అనంతరం నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. నాడు నేడు పథకం పేరుతో తాత్కాలిక రంగులు వేసి, హంగులు చేసి నిధులు దోపిడీ చేశారని మండిపడ్డారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేత, నాటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మద్దతుగా నిలవడంపై ఏపీ మంత్రులు వాసంశెట్టి సుభాష్, నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బాక్స్‌లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా జైలులో ఉంచారు.
జగన్ పాలనలో నీటి ప్రాజెక్ట్‌లు అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) అన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో 20 ఏళ్లు జలవనరుల శాఖ వెనక్కు వెళ్లిందని చెప్పారు.