Home » Nepal
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వంపై ఉన్న ఉత్కంఠ ఇప్పటికే తొలగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం జూన్ 8న ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో మోదీ ప్రమాణ స్వీకారోత్సవ(Swearing Ceremony) కార్యక్రమానికి పొరుగు దేశాల నేతలతోపాటు మరికొంత మంది పాల్గొననున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తు తీవ్ర అనారోగ్యానికి గురై ఖట్మాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయుడు బన్సీలాల్ మృతి చెందినట్లు నేపాల్ పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు.
అనుమానం పెనుభూతం లాంటిదని అంటారు. ఇది ఒక్కసారి మనసులోకి ఎక్కితే.. మనిషిని ఒక మృగంలా మార్చేస్తుంది. ఇది ఎలాంటి దారుణాలైనా చేయిస్తుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా తాజా ఉదంతాన్నే...
ఇటీవలే సింగపూర్, హాంకాంగ్‌లో నిషేధానికి గురైన భారత్‌కు చెందిన మసాలాల కంపెనీలు ఎవరెస్ట్ (Everest), ఎండీహెచ్ (MDH spices)కు మరో షాక్ తగిలింది. ఈ కంపెనీలపై తాజాగా నేపాల్ (Nepal) కూడా బ్యాన్ విధించింది. ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతులపై నిషేధం విధించినట్లు పేర్కొంది.
భారత్‌లోని భూభాగాలను తమ మ్యాప్‌లో చూపించడమే కాకుండా.. తమ దేశ కరెన్సీ నోటుపై కొత్త మ్యాప్‌ను ముద్రించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేపాల్ కరెన్సీలోని రూ.100 నోటుపై పాత మ్యాప్‌కు బదులు కొత్త మ్యాప్‌ను రూపొందించాలని నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ కు భారీ ఉమశమనం లభించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో ఆయన గెలిచారు. దహల్‌కు అనుకూలంగా 157 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 110 ఓట్లు పోలయ్యాయి. ఒకరు గైర్హాజరయ్యారు.
నేపాల్ రాజకీయాల్లో సంక్షోభం కొనసాగుతుంది. ఈ క్రమంలో అక్కడి ప్రధాని ప్రచండ మాజీ ప్రధాని ఓలీ పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ(Delhi)ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌లో 5.6 తీవ్రతతో ఇవాళ భూకంపం(Earthquake) వచ్చింది. ఆ తరువాత ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ - ఎన్ సీఆర్‌లో ప్రకంపనలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.
నేపాల్‌ను 6.4 తీవ్రతతో పెను భూకంపం శనివారంనాడు కుదిపేయడంతో భారతదేశం తక్షణ ఆపన్నహస్తం అందించింది. వైద్య సామగ్రి, రిలీఫ్ మెటీరియల్, తదితరాలతో కూడిన ఎమర్జెన్సీ ఎయిడ్ ప్యాకేజీని ఆదివారంనాడు నేపాల్‌కు పంపింది.
నేపాల్‌లో అర్ధరాత్రి సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ భూకంపంలో మృతుల సంఖ్య 100 దాటింది. ఇప్పటివరకు 128 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.