Home » Nellore politics
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సూపర్ 6 పథకాలను వరుసగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
జగన్ పార్టీనే క్రిమినల్ మైండ్ పార్టీ అని మంత్రి నారాయణ విమర్శించారు. యావత్ దేశం సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు మాట్లాడిన మాటలను ఖండించాలని మంత్రి నారాయణ అన్నారు.
దళిత పాత్రికేయుడు తోకల శ్రీనుపై కావలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రామిరెడ్డి వ్యాఖ్యలపై నెల్లూరు పోలీసులకు దళిత, ప్రజాసంఘాలు ఫిర్యాదు చేశాయి. రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Minister Narayana: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఏపీకి చాలా నష్టం చేశారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్థంగా పనులు చేశారని మంత్రి నారాయణ విమర్శించారు.
MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ అమంచర్ల పార్కు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా భారత్ సిందూర్ యంఎస్ఏంఈ పార్క్‌గా పేరు పెట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది తెలిపారు. యంఎస్ఎంఈ పార్కు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్‌లో మరింత విస్తరిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది అన్నారు.
Kavali Pylon Toppling Case: కావలిలో అమృత్ పథకంలో భాగంగా పైలాన్ కూలదోసిన కేసులో నలుగురిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో పలుకీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మోడల్‌గా మార్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డిని మంత్రి లోకేశ్ ప్రశంసించారు. కేవలం 60 రోజుల్లో 339 అభివృద్ధి పనులు రూ.41 కోట్లతో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు.
MLA Kotamreddy: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా నెల్లూరు పయనిస్తోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఒకే నియోజకవర్గంలో, ఒకేరోజు ఇన్ని పనులని ఎవరూ చేపట్టి పూర్తి చేయలేదని అన్నారు.
Kakani Govardhan Reddy : అసెంబ్లీ ఎన్నికల అనంతరం జగన్ పార్టీని పలువురు నేతలు ఒక్కొక్కరుగా వీడుతోన్నారు. మరికొందరు వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆ క్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో.. పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో కాకాణికి మరో గట్టి దెబ్బ తగిలింది.
CM Chandrababu Naidu: రాజధాని అమరావతికి రైతులు పైసా తీసుకోకుండా రూ.33వేల ఎకరాలు ఇచ్చారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి ఇవ్వడం ప్రపంచంలోనే ఒక చరిత్ర అని అభివర్ణించారు. ఇప్పుడు వచ్చే ఆదాయనికంటే ఎక్కువ ఇస్తామని రైతులకు చెప్పామని సీఎం చంద్రబాబు తెలిపారు.