Home » NDA Alliance
రాజకీయాలు కొత్త ఏం కాదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ (Bhupathiraju Srinivasa Varma) అన్నారు. కష్టపడ్డ సామాన్య కార్యకర్తకు బీజేపీ గుర్తింపు ఇస్తుంది అనేదానికి తాను ఉదాహరణ అని చెప్పారు. పొత్తుల చర్చల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తకు ఇచ్చే భరోసా ఏంటి అని ప్రశ్నించామని అన్నారు.
గత జగన్ పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. బీజేపీ ఏపీ ఆధ్వర్యంలో విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాలులో ప్రజా ప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు.
ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌లో లోక్‌సభ స్పీకర్ పదవి(Lok Sabha Speaker Post) ఎవరిని వరిస్తుందనే చర్చకు ఫుల్ స్టాప్ పడినట్లే. స్పీకర్ పదవిని బీజేపీ తన దగ్గర ఉంచుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి విజయం కోసం అమెరికా నుంచి తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారైలు గెలుపు సంబరాలు చేసుకున్నారు.
ఏపీలో కూటమి విజయంపై అగ్రరాజ్యం అమెరికాలో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా మిన్నెసోటా రాష్ట్ర జంట నగరాలైన మిన్నియాపోలీస్, సెయింట్ పాల్‌లలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నారైలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. ఎన్డీయే మిత్రపక్షాలకు 292 మంది ఎంపీల బలం ఉంది. బీజేపీ సొంతంగా 240 మంది ఎంపీలున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అఖండ విజయం సాధించడంపై ఎన్ఆర్ఐలు(NRI) హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమది ప్రజా ప్రభుత్వమని.. దుర్మార్గపు ప్రభుత్వం కాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ (Pithani Satyanarayana) వ్యాఖ్యానించారు. దుర్మార్గపు ప్రభుత్వం ఏదో ప్రజలు అర్థం చేసుకున్నారని.. ఆ ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు.
సీపీ నుంచి వచ్చే వారిని తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి డంపింగ్ యార్డ్ కాదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని నష్టపరిచి దాకోవడానికి, దాచుకోవడానికి వచ్చేవారిని కూటమిలో చేర్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కొత్త ప్రస్థానం మొదటి అడుగు– ప్రభుత్వం ఏర్పాటు– లోనే తడబడ్డారు. దేశ ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలు ఆశాజీవులు. మరి కేంద్రంలో కొలువుదీరిన కొత్త సర్కార్ తన రెండవ, మూడవ అడుగులు– పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ సమర్పణ– ఎలా ఉండనున్నాయోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.