Home » NCP
మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్ కు వైద్య కారణాల రీత్యా రెండు నెలల పాటు సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసు కింద 2022 ఫిబ్రవరిలో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.
కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల సత్తా ఉన్నవారు సైతం ప్రధాన మంత్రి పదవిని చేపట్టలేకపోయారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
మహారాష్ట్ర దిగ్గజ నేత శరద్ పవార్ సారథ్యంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరో చీలిక దిశగా పయనిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోసారి తిరుగుబాటు తప్పకపోవచ్చని పార్టీ వర్గాల సమాచారం. ఈసారి ఎన్‌సీపీ నేత జయంత్ పాటిల్ ఎన్‌సీపీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు.
‘లోకమాన్య’ బాల గంగాధర్ తిలక్ (Lokmanya Bal Gangadhar Tilak) ఘనతను ప్రజలే గుర్తించారని, ఆయనకు ‘లోకమాన్య’ బిరుదును ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించడం తనకు మధుర జ్ఞాపకమని తెలిపారు.
తమ పార్టీ, కాంగ్రెస్, శివసేన కలిసి నిర్ణయం తీసుకుంటే మహారాష్ట్రలో మార్పు తీసుకురాగలమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంలో తాము నిమగ్నవడం కష్టమని తెలిపారు. కాకపోతే కొంత పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్ర, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఆయన శనివారం ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్‌సీపీ తన ప్రభుత్వంలో చేరినప్పటి నుంచి శివసేనలో ఆగ్రహం పెల్లుబుకుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళడం గమనార్హం.
బెంగళూరులో జరుగుతున్న విపక్షాల సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ రెండో రోజు పాల్గొననున్నారు. కూతురు సుప్రియా సూలేతో కలిసి ఆయన ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్బంగా ప్రభుత్వం ఆనావాయితీగా ఆదివారంనాడు ఇచ్చిన టీపార్టీని మహా వికాస్ అఘాడీ నేతలు బహిష్కరించారు. ఈనెల 17వ తేదీ సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)పై నియంత్రణ సాధించేందుకు పోరాటం జరుగుతున్న సమయంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar)తో రెబెల్ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలోని ఎన్‌సీపీని అణగిమణగి ఉండేలా చేయాలనుకున్న ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ వర్గాలకు గట్టి ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు తెలుస్తోంది.