Home » NASA
తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎనిమిది రోజుల పర్యటన నిమిత్తం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎ్‌సఎస్) వెళ్లి 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు సురక్షితంగా భూమికి చేరుకున్నారు.
Sunita Williams Viral Video : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్‌లను తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ క్షేమంగా ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అయింది. ఆ క్షణంలోనే అనుకోని అతిథులు ఎదురొచ్చి వీరికి స్వాగతం పలికి ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఈ అద్భుత దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
నాసా వ్యోమగాములు సునీత, బుచ్ సురక్షితంగా భూమి మీదకు చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరి ఇంతకాలం అంతరిక్షంలో గడిపినందుకు వారి పారితోషికం ఎంతో తెలుసుకుందాం పదండి
వ్యోమగాములను సురక్షితంగా భూమ్మీదకు చేర్చిన నాసా, స్పేస్ ఎక్స్ బృందాలకు టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మిషన్‌కు తొలి ప్రాధాన్యం ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్ కూడా ధన్యవాదాలు తెలిపారు.
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భారత్‌లో పర్యటిస్తారని ఆమె కుటుంబసభ్యులు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యలో తెలిపారు. పర్యటన తేదీలు ఇంకా ఖరారు ఈఏడాదిలోనే ఆమె భారత్‌లో పర్యటిస్తారని తెలిపారు.
తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపి సురక్షితంగా తిరిగి వచ్చిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు నాసా వైద్యుల పర్యవేక్షణలో మరిన్ని కొన్ని రోజులు ఉండనున్నారు. అంతరిక్షంలో తమ అనుభవాలను కూడా వారు నాసా అధికారులతో పంచుకుంటారు. వైద్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఆస్ట్రోనాట్స్ తమ కుటుంబసభ్యులను కలుసుకునేందుకు నాసా అనుమతిస్తుంది.
Sunitha Williams: దాదాపు ఎనిమిది నెలల అనంతరం అంతరిక్షం నుంచి భూమికి చేరిన సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్‌మోర్‌లు ప్రయాణించిన వ్యోమ నౌక సురక్షితంగా భూమిని చేరింది. అనంతరం వారిని హ్యూస్టన్ తరలించారు. ఎందుకంటే..
Sunita Williams: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు 9 నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం ఇంటికి తిరుగు ప్రయాణమైంది. దీంతో గుజరాత్‌లో నివసిస్తున్న ఆమె పూర్వీకులు ఇంటికి తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.
Sunitha Williams : దాదాపు 9 నెలల నిరీక్షణ తర్వాత తిరిగి భూమిపైకి అడుగుపెట్టబోతున్నారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్. వీరు స్పేస్ ఎక్స్ ప్రయాణిస్తున్నక్రూ డ్రాగన్ క్యాప్సుల్ ఎక్కడ ల్యాండ్ అవబోతోంది. సుదీర్ఘ సమయం తర్వాత భూమిపై కాలుమోపగానే వ్యోమగాములు చేయాల్సిన పనులు ఏమిటి..
సునీతా విలియమ్స్ బుధవారం తెల్లవారుజామున భూమ్మీద అడుగుపెట్టనుంది. ఆమెతో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన బచ్ విల్మోర్ కూడా కిందకు రానున్నాడు. నాసా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.