Home » Narendra Modi
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పుపట్టారు.
ఎంతోకాలంగా ఎదురుచూసిన విలువైన క్షణాలు కళ్ల ముందుకు వచ్చినప్పుడు కలిగే ఆనందం, భావోద్వేగం మాటలకు అందదు. ఆ తృప్తికి మించిన తృప్తి ఇక జీవితంలో ఉండదనే అనుభూతి కలుగుతుంది. అలాంటి భావోద్వేగ ఘటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు జరిపిన హర్యానా పర్యటనలో చోటుచేసుకుంది.
అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని ఆయన మండిపడ్డారు.
ముస్లింలపై అంత ప్రేముంటే పార్టీ అధ్యక్షుడి పదవి ముస్లింలకు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీని మోదీ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం టిక్కెట్లు వారికే ఇచ్చి, వారు గెలిచి ఉంటే తమ అభిప్రాయాలను వారు వ్యక్తం చేసి ఉండేవారు కాదా అని నిలదీశారు.
ముంబై ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడైన తహవూర్ రాణాని ఇండియాకు తీసుకువచ్చారు. ఇది మోదీ ప్రభుత్వం సాధించిన దౌత్య విజయం అని ప్రశంసిస్తున్నారు. రాణాను ఇండియాకు తీసుకువచ్చిన నేపథ్యంలో మోదీ పాత ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు..
అమీనా మనీకా మినికాయ్ ద్వీపం నుంచి ఢిల్లీలోని మోదీతో భేటీ కావడానికి హెలికాప్టర్ సేవలు ఉపయోగించుకుంది. ముద్రా యోజన ద్వారా ఆమెకు ఆర్థిక సహాయం అందించి ఈ ఘనత సాధించడానికి సహాయపడింది
తమిళనాడుకు కేంద్రం కేటాయింపులపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రాజేశాయి. గతంతో పోలిస్తే.. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే తమిళనాడుకు భారీగా నిధులు కేటాయించామన్న మోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత పీ చిదంబరం కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు రామేశ్వరంలోని పాంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడులో మౌలిక సదుపాయాల కల్పనకు గత పదేళ్లలో భారీగా నిధులిచ్చామని చెప్పారు. 2014 కంటే ముందుతో పోల్చుకుంటే గత పదేళ్లలో తమిళనాడు అభివృద్ధికి మూడు రెట్లు అధికంగా నిధులిచ్చామన్నారు.
త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ప్రధాని అధికారిక కార్యక్రమానికి సీఎం హాజరుకాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
తమిళ భాషలో మెడికల్ కోర్సులు ప్రారంభించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని తాను కోరుతున్నాననీ, ఇందువల్ల పేద కుటుంబాల పిల్లలు సైతం వైద్యులు కావాలనే తమ కలలను పండించుకుంటారని మోదీ అన్నారు.