Home » Nara Brahmani
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కోడలు, లోకేష్ సతీమణి బ్రహ్మణి ట్విట్టర్ వేదికగా తెలిపారు.
రాజమండ్రి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి శుక్రవారం సాయంత్రం ములాఖత్ అయ్యారు. సుమారు 45 నిముషాలపాటు వారు చంద్రబాబుతో మాట్లాడనున్నారు.
గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ వినూత్న కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఎమ్మెల్యే చినరాజప్ప ములాఖత్ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తోంది. ‘‘మోత మోగిద్దాం’’ అంటూ బ్రహ్మణి ఇచ్చిన పిలుపుతో ఉదయం నుంచే విశాఖ వాసులు సంపూర్ణ మద్దతు తెలిపారు.
చంద్రబాబు నాయుడుకి మద్దతుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, సతీమణి బ్రహ్మణి పిలుపునిచ్చిన ‘‘మోత మోగిద్దాం’’ కార్యక్రమానికి ఎంపీ రఘురామ సంఘీభావం తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా, రాజ్యాంగాన్ని నమ్మేవారు అందరూ చంద్రబాబుకు మద్దతు తెలపాలని కోరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ మోత మోగిద్దాం పేరిట నిరసన కార్యక్రమానికి కోడలు నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇతర రాష్ట్రాల అభివృద్ధి అజెండాగా ఏపీ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర శుక్రవారం రాత్రి నుంచి తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ లోపే లోకేష్ రాజమండ్రి రావాలని పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ) సూచించినట్లు సమాచారం. ఒకవేళ లోకేష్‌ను అరెస్టు చేస్తే..
రాజమండ్రి(Rajahmundry)లోని లోకేష్ క్యాంపు(Lokesh Camp) సైట్ వద్ద ఏపీ పోలీసులు(AP Police) అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసుల చర్యలతో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.