Home » Nandamuri Taraka Rama Rao
టీడీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ పతాకాన్ని టీడీపీ విశాఖ లోక్‌సభ అభ్యర్థి శ్రీ భరత్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి, పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ.. తెలుగుదేశం ఎన్టీఅర్ స్థాపించిన పార్టీ కాబట్టి సమ్ థింగ్ స్పెషల్ అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.