• Home » Nalgonda

Nalgonda

Nagarjunasagar: నాగార్జునసాగర్ 13, 14 గేట్లు ఎత్తివేత

Nagarjunasagar: నాగార్జునసాగర్ 13, 14 గేట్లు ఎత్తివేత

Telangana: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. వరద నీరు అధికంగా పోటెత్తడంతో గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు ఉదయం సాగర్ గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 13, 14 గేట్లను ఎత్తివేశారు. ఈ రెండు గేట్లను దాదాపు ఐదు అడుగుల మేర ఎత్తేవేసి నీటిని విడుదల చేశారు.

Komatireddy Venkatreddy: అమెరికా వెళ్లొచ్చేలోగా బీఆర్‌ఎస్‌ ఆఫీసు కూల్చేయండి

Komatireddy Venkatreddy: అమెరికా వెళ్లొచ్చేలోగా బీఆర్‌ఎస్‌ ఆఫీసు కూల్చేయండి

‘నేను అమెరికా వెళ్లి ఈనెల 11న తిరిగొస్తా.. ఈలోగా అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని కూల్చేయండి’ అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ మునిసిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు.

Telangana: వామ్మో ఇంత బంగారమా? ఎలా తీసుకెళ్తున్నారో మీరే చూడండి..!

Telangana: వామ్మో ఇంత బంగారమా? ఎలా తీసుకెళ్తున్నారో మీరే చూడండి..!

Telangana Police Caught Gold: కేటుగాళ్లు రోజుకింత రాటుదేలుతున్నారు. పోలీసులను మస్కా కొట్టించి మరీ స్మగ్లింగ్ చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చట్ట వ్యతిరేక పనులు చేసేస్తున్నారు. కానీ, అన్ని రోజులూ వారివే కాదు కదా! తాజా ఘటనలో అదే జరిగింది. ఖాకీల తెలివి ముందు.. ఈ కేటుగాళ్లు బేజారయ్యారు. ఇంకేముంది..

Komatireddy Venkat Reddy: బీజేపీలో విలీనం దిశగా బీఆర్‌ఎస్‌ అడుగులు

Komatireddy Venkat Reddy: బీజేపీలో విలీనం దిశగా బీఆర్‌ఎస్‌ అడుగులు

బీజేపీలో విలీనం దిశగా బీఆర్‌ఎస్‌ అడుగులు వేస్తోందని, ఆ మేరకు తనకు, ముఖ్యమంత్రికి సమాచారం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Komatireddy: ప్రజలే బీఆర్‌ఎస్‌ను చీల్చిచెండాడారు...

Komatireddy: ప్రజలే బీఆర్‌ఎస్‌ను చీల్చిచెండాడారు...

Telangana: భవిష్యత్తులో బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామంటూ మాజీముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌ను ప్రజలు చీల్చి చండాడితేనే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవక ఏడు సీట్లలో డిపాజిట్ కోల్పోయారని వ్యాఖ్యలు చేశారు.

Passport Renewal: విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి పాస్‌పోర్టు హక్కు కాదు: హైకోర్టు

Passport Renewal: విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి పాస్‌పోర్టు హక్కు కాదు: హైకోర్టు

క్రిమినల్‌ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి పాస్‌పోర్ట్‌ను తన హక్కుగా కోరరాదని హైకోర్టు స్పష్టం చేసింది. అందుకు పాస్‌పోర్ట్‌ చట్టం అనుమతించదని తెలిపింది.

Jagadish Reddy: రుణమాఫీ ఒక జోక్.. మాజీ మంత్రి ఫైర్..

Jagadish Reddy: రుణమాఫీ ఒక జోక్.. మాజీ మంత్రి ఫైర్..

రుణమాఫీపై స్పష్టత లేదని వివరాలు అడిగితే అధికారులు గందరగోళానికి గురవుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Jagdish Reddy) అన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, కానీ అది ఒక పెద్ద జోక్‌లా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

Congress: ఎట్టి పరిస్థితుల్లో రూ.2 లక్షల రుణమాఫీ

Congress: ఎట్టి పరిస్థితుల్లో రూ.2 లక్షల రుణమాఫీ

ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న అందరికి మాఫీ అయ్యిందని వివరించారు. రెండో దఫాలో రూ.2 లక్షల వరకు లోన్ తీసుకున్న వారికి మాఫీ అవుతుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తోందని వెల్లడించారు. రైతుల మేలు కోరి రుణమాఫీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

Nalgonda: తొలివిడతలో నల్లగొండకు అత్యధిక నిధులు!

Nalgonda: తొలివిడతలో నల్లగొండకు అత్యధిక నిధులు!

రుణమాఫీ పథకంలో భాగంగా తొలి విడతలో లక్ష రుణ మాఫీ ప్రక్రియలో నల్లగొండ నుంచి అత్యధిక మొత్తంలో రుణాలు మాఫీ అయ్యాయి.

Yadadri: యాదగిరి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఆలయ ఈవో..

Yadadri: యాదగిరి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఆలయ ఈవో..

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహస్వామి కొండ చుట్టూ సోమవారం ఉదయం సామూహిక గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి