Home » Nadendla Manohar
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రుగులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇప్పటికే కొందరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu).. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సచివాలయం వేదిక అయ్యింది..
రేషన్ సరఫరాలో అక్రమాలకు తావు లేదని.. అక్రమాలకు పాల్పడిన ఎవరిని వదలిపెట్టబోనని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వార్నింగ్ ఇచ్చారు. లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం జరిపినట్లు తెలిపారు.
: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయం ఖరారు కావాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిన జనసేనాని నేరుగా జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయం పరిశీలించారు. తన కోసం ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ నిశీతంగా పరిశీలించారు. ఆ కార్యాలయాన్ని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పరిశీలించారు.
పదవులు దక్కాయని రిలాక్స్ అవకుండా కార్యాచరణ చేపడుతున్నారు కొత్త మంత్రులు. మొన్నటికి మొన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఆకస్మిక పర్యటనలు నిర్వహించి అధికారులను హడలెత్తించారు. తాగునీటి సమస్యకు చెక్ పెట్టించారు. ఇక నేడు తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు. ముందుగా రైతుల కోసం పంట కాల్వలు, తెనాలి ప్రజానీకం కోసం డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నారు
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 164 సీట్లు సాధించిన విషయం తెలిసిందే. కూటమిలో భాగమైన జనసేన 21 సీట్లు సాధించింది. అయితే ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించడంపై జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కూటమిపై నమ్మకంతో అద్భుతమైన విజయం అందించారని హర్షం వ్యక్తం చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు మే13వ తేదీన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే జూన్4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ చేయనున్నారు. ఈ మేరకు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ (Nandedla Manohar) ఆదివారం మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ నేపథ్యంలో తెనాలిలో అల్లరి మూకలు ఘర్షణలు సృష్టించే అవకాశం ఉందని తనకు సమాచారం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly) ఎన్నికల్లో తమ విజయం తద్యమని కూటమి అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈసారి జరిగిన ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ కూడా అవసరం లేదని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కూటమి తరఫున పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులతో అగ్రనేతలు చంద్రబాబు (Chandrababu), అరుణ్ సింగ్, పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. నిత్యం జనాల్లోనే వారిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు బి ఫారాలు అందజేశారు. తొలి ఫారంను జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ అందజేశారు.