• Home » MS Dhoni

MS Dhoni

MS Dhoni: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో గోల్ఫ్ ఆడిన ధోనీ.. వీడియో వైరల్

MS Dhoni: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో గోల్ఫ్ ఆడిన ధోనీ.. వీడియో వైరల్

మహేంద్ర సింగ్ ధోనీ అమెరికా పర్యటనలో ఉన్న విషయాన్ని తెలుసుకుని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతడిని తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించాడు. దీంతో ట్రంప్‌ నివాసానికి వెళ్లిన ధోనీ ఆయన ఆతిథ్యం స్వీకరించాడు. అంతేకాకుండా సరదాగా కాసేపు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడు. ధోనీ, ట్రంప్ కలిసి గోల్ఫ్ ఆడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Asia Cup: వీడు మామూలోడు కాదు.. కోహ్లీ, ధోని రికార్డులను బద్దలు కొట్టిన ఇషాన్ కిషన్

Asia Cup: వీడు మామూలోడు కాదు.. కోహ్లీ, ధోని రికార్డులను బద్దలు కొట్టిన ఇషాన్ కిషన్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని రికార్డులను యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ బద్దలుకొట్టాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 82 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.

Viral Video: ధోనికి అభిమానులు కాదు.. భక్తులు ఉంటారనడానికి ఈ వీడియోనే సాక్ష్యం!

Viral Video: ధోనికి అభిమానులు కాదు.. భక్తులు ఉంటారనడానికి ఈ వీడియోనే సాక్ష్యం!

మహేంద్ర సింగ్ ధోని. ఏ మాత్రం పరిచయం అవసరం లేని పేరు ఇది. చిన్నపెద్ద అనే తేడా లేకుండా మెజారిటీ వ్యక్తులకు ధోని గురించి తెలుసు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్‌గా ధోని చరిత్రలో నిలిచిపోయాడు.

Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్.. ధోనీ కుమార్తె రియాక్షన్ చూశారా?

Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్.. ధోనీ కుమార్తె రియాక్షన్ చూశారా?

చంద్రయాన్-3 సక్సెస్‌తో మన దేశంపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. రాజకీయ నేతలు, సినిమా స్టార్లు, క్రీడాకారులు కూడా విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఈ సందర్భంగా ఇస్రో సాధించిన విజయాన్ని ధోనీ కూడా కుటుంబ సమేతంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే ధోనీ కుమార్తె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

World Cup: వరల్డ్‌ కప్‌నకు రోహిత్‌ను ఎంపిక చేయొద్దని ధోనినే చెప్పాడు.. మాజీ సెలెక్టర్ సంచలన కామెంట్స్

World Cup: వరల్డ్‌ కప్‌నకు రోహిత్‌ను ఎంపిక చేయొద్దని ధోనినే చెప్పాడు.. మాజీ సెలెక్టర్ సంచలన కామెంట్స్

మహేంద్రసింగ్ ధోని కోరిక మేరకే 2011 వన్డే ప్రపంచకప్‌నకు రోహిత్ శర్మను ఎంపిక చేయలేదని టీమిండియా మాజీ సెలెక్టర్ రాజా వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

IND vs WI 3rd T20: ద్రావిడ్ బాటలో హార్దిక్.. అప్పుడు సచిన్, ఇప్పుడు తెలుగోడికి అన్యాయం.. భగ్గుమంటున్న ఫ్యాన్స్!

IND vs WI 3rd T20: ద్రావిడ్ బాటలో హార్దిక్.. అప్పుడు సచిన్, ఇప్పుడు తెలుగోడికి అన్యాయం.. భగ్గుమంటున్న ఫ్యాన్స్!

టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్(Hardik Pandya) పాండ్యా ఇటీవల వరుసగా విమర్శలకు గురవుతున్నాడు. వన్డే సిరీస్ సమయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(west indies cricket board) సరైన వసతులు కల్పించడంలేదని మాట్లాడి పలువురు నుంచి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక మొదటి రెండు టీ20ల్లో ఓడిన తర్వాత హార్దిక్ కెప్టెన్సీపై విమర్శల వర్షం కురిసింది.

Saba Karim: 2004 పాకిస్థాన్ పర్యటనకు ధోనీ ఎందుకు ఎంపిక కాలేదంటే..? ఆసక్తికర విషయాలు బయటపెట్టిన మాజీ సెలెక్టర్

Saba Karim: 2004 పాకిస్థాన్ పర్యటనకు ధోనీ ఎందుకు ఎంపిక కాలేదంటే..? ఆసక్తికర విషయాలు బయటపెట్టిన మాజీ సెలెక్టర్

తొలి నాళ్లలో ధోని భారత జట్టుకు ఎలా ఎంపికయ్యాడనే విషయాలను నాటి బీసీసీఐ సెలెక్టర్ సబా కరీమ్ తెలిపాడు. ముఖ్యంగా 2004 పాకిస్థాన్ పర్యటన సందర్భంగా నాటి టీమిండియా కెప్టెన్ గంగూలీకి ధోని గురించి చెప్పినట్లు చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తూ నాటి పాక్ పర్యటనకు ధోని ఎంపిక కాలేదు. అయితే దీనికి గల ఆసక్తికర కారణాలను సబా కరీమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Virat Kohli: ధోని రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

Virat Kohli: ధోని రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) రికార్డును బద్దలుకొట్టాడు. టీమిండియా గెలిచిన అత్యధిక మ్యాచ్‌ల్లో జట్టులో సభ్యుడిగా ఉన్న రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

World Record: ధోనీ ప్రపంచ రికార్డును అధిగమించిన బెన్ స్టోక్స్

World Record: ధోనీ ప్రపంచ రికార్డును అధిగమించిన బెన్ స్టోక్స్

ఇప్పటివరకు టెస్టుల్లో 250 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఎక్కువ సార్లు ఛేదించిన టీమ్ కెప్టెన్‌గా రికార్డు ధోనీ పేరిట ఉంది. ధోనీ నేతృత్వంలో టీమిండియా నాలుగు సార్లు 250కి పైగా టార్గెట్లను ఛేదించి విజయాలు కైవసం చేసుకుంది. తాజాగా ఆస్ట్రేలియాపై 251 పరుగుల టార్గెట్‌ను బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ అధిగమించి గెలిచింది. అయితే స్టో్క్స్ కెప్టెన్‌గా 250 రన్స్‌కు పైగా టార్గెట్లను ఛేదించడం ఇంగ్లండ్‌కు ఇది ఐదోసారి. దీంతో ధోనీ పేరిట ఉన్న రికార్డును స్టోక్స్ అధిగమించాడు.

Viral Video: పెంపుడు కుక్కలతో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ధోనీ

Viral Video: పెంపుడు కుక్కలతో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఈ సారి తన పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా జరుపుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా తన పెంపుడు కుక్కలతో ధోనీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి