Home » Moon
దక్షిణ ధ్రువంపై నిర్వహించిన పరీక్షల్లో భాగంగా.. చంద్రునిపై సల్ఫర్ ఉందన్న విషయాన్ని చంద్రయాన్-3 మిషన్ ధృవీకరించిన విషయం తెలిసిందే. తొలుత మంగళవారం నాడు...
బుధవారం రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. అరుదుగా కనిపించే సూపర్ బ్లూ మూన్ కనువిందు చేయనుంది. బుధవారం రాత్రి 7 గంటల 10 నిమిషాల నుంచి గురువారం ఉదయం 6 గంటల 46 నిమిషాల వరకు ఈ సూపర్ బ్లూమూన్ ఆకాశంలో దర్శనమివ్వనుంది.
చంద్రుడిపై విజయవంతంగా ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3కి చెందిన ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధృవ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా అధికారికంగా ప్రకటించింది.
అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ పేరును పొరపాటున బాలీవుడ్ నటుడు రాకేష్ రోషన్ అంటూ గత వారం మాట్లాడిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తడబడ్డారు. ఈసారి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చంద్రుడు దగ్గరకు వెళ్లారంటూ వ్యాఖ్యానించి నెటిజెన్ల విమర్శలకు గురయ్యారు.
చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లూనా సొసైటీ ఇంటర్‌నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ కంపెనీలు చంద్రుడిపై భూమిని విక్రయిస్తున్నాయి. అయితే చంద్రుడిపై భూమి కొనుగోలు విషయంలో కొన్ని షరతులు వర్తిస్తాయి. తాజాగా తెలంగాణకు చెందిన మహిళ కూడా స్థలం కొనుగోలు చేసింది.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి ల్యాండర్ మనదే కావడంతో ప్రపంచ దేశాలన్నీ ‘జయహో భారత్’ అని వేనోళ్లా కీర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రయాన్-3 ప్రయోగం గురించి ప్రశంసించబోయి రాజస్థాన్‌కు చెందిన క్రీడా శాఖా మంత్రి అశోక్ చంద్నా పరువు పోగొట్టుకున్నారు.
జాబిల్లిపై సురక్షితంగా ల్యాండ్ అయిన చంద్రయాన్-3కి సంబంధించి.. ఈ ఘనత సాధించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కమ్మని కబురు దేశ ప్రజలకు అందించింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌కు, బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంతో(MOX-ISTRAC) కమ్యూనికేషన్ లింక్ ఏర్పడినట్లు ట్విటర్ వేదికగా ఇస్రో వెల్లడించింది. అంతేకాదు.. ల్యాండర్ చంద్రుడిపై దిగాక తీసిన ఫొటోలను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. జాబిల్లిపై భారత్ జెండా పాతింది. అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. చంద్రయాన్-3 జాబిల్లిపై అడుగుపెట్టింది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 సురక్షితంగా ల్యాండ్ అయింది. 40 రోజులు ప్రయాణించి చంద్రయాన్-3 జాబిల్లిపై దిగింది. ఇప్పుడు ‘వాట్ నెక్ట్స్’ అనే ప్రశ్న చాలామందిలో ఉత్సుకత రేకెత్తిస్తోంది.
చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్ 3 చంద్రుడిపై అడుగుపెడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
చంద్రయాన్ 3 ఎప్పుడెప్పుడు చంద్రుడిపై అడుగుపెడుతుందా అని ఎదురుచూస్తున్న దేశ ప్రజలకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఓ శుభవార్త చెప్పింది.