• Home » Mizoram

Mizoram

Mizoram: మిజోరంలో కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం

Mizoram: మిజోరంలో కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం

మిజోరం కొత్త ముఖ్యమంత్రిగా జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) నేత 73 ఏళ్ల లాల్‌దుహోమా (Lalduhoma) శుక్రవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు జడ్‌పీఎం నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

Baryl Vanneihsangi: ఎవరీ బేరిల్ వన్నెహసాంగి.. టీవీ యాంకర్ నుంచి ఎమ్మెల్యేగా ఎలా ఎదిగింది?

Baryl Vanneihsangi: ఎవరీ బేరిల్ వన్నెహసాంగి.. టీవీ యాంకర్ నుంచి ఎమ్మెల్యేగా ఎలా ఎదిగింది?

అప్పుడప్పుడు రాజకీయాల్లో ఎవ్వరూ ఊహించని చమత్కారాలు చోటు చేసుకుంటుంటాయి. వాటిల్లో బేరిల్ వన్నెహసాంగి అనే మహిళా ఎమ్మెల్యే ఒకరు. టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించిన ఆమె.. అంచలంచెలుగా ఎదుగుతూ అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా...

Zoramthanga: గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన సీఎం

Zoramthanga: గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన సీఎం

ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తూ మిజోరం ముఖ్యమంత్రి జోరంతాంగ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ డాక్టర్ హరిబాబు కుంభంపాటికి అందజేశారు. ఆయన రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సోమవారంనాడు వెలువడిన మిజోరం ఎన్నికల ఫలితాల్లో జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ మొత్తం 40 స్థానాలకు 27 స్థానాల్లో గెలుపొంది అధికారం ఖాయం చేసుకుంది.

Election Results: సీఎం, డిప్యూటీ సీఎం ఓటమి... ఓటరు దేవుడు వినూత్న తీర్పు

Election Results: సీఎం, డిప్యూటీ సీఎం ఓటమి... ఓటరు దేవుడు వినూత్న తీర్పు

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, అధికార మిజో నేషనల్ ఫ్రంట్‌ను వెనక్కి నెట్టేసింది. లాల్ దహోమా సారథ్యంలోని జోరామ్ పీపుల్స్ మూవ్‌వెంట్ 40 స్థానాల్లో 27 స్థానాలు గెలుచుకుని అధికారం ఖాయం చేసుకోగా, ఎంఎన్ఎఫ్ 10 సీట్లకే పరిమితమైంది.

Mizoram Elections: ఎవరీ లాల్ దుహోమా? మిజోరంలో దూసుకుపోతున్న దుహోమా పార్టీ!

Mizoram Elections: ఎవరీ లాల్ దుహోమా? మిజోరంలో దూసుకుపోతున్న దుహోమా పార్టీ!

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అయిన జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ దూసుకుపోతోంది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న పోలింగ్ జరగ్గా.. 80 శాతానికి పైగానే పోలింగ్ నమోదైంది. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు ఆదివారమే మిజోరం కౌంటింగ్ కూడా జరగాల్సి ఉంది.

Mizoram Election Results: మిజోరంలో ఆధిక్యత ప్రదర్శిస్తున్న ZPM.. వెనకబడిన MNF

Mizoram Election Results: మిజోరంలో ఆధిక్యత ప్రదర్శిస్తున్న ZPM.. వెనకబడిన MNF

మిజోరం ఎన్నికల(Mizoram Assembly Elections 2023) ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. కౌంటింగ్ కేంద్రాల నుండి ముందస్తు లీడ్‌లు రావడంతో, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ZPM, ముఖ్యమంత్రి జోరంతంగా(Zoramthanga) నేతృత్వంలోని అధికార MNF కంటే ముందుంది.

Mizoram: ప్రారంభమైన మిజోరం ఎన్నికల కౌంటింగ్.. ప్రాంతీయ పార్టీలు మళ్లీ సత్తా చాటుతాయా?

Mizoram: ప్రారంభమైన మిజోరం ఎన్నికల కౌంటింగ్.. ప్రాంతీయ పార్టీలు మళ్లీ సత్తా చాటుతాయా?

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తయిన ఒక రోజు తరువాత ఇవాళ ఉదయం 8 గంటలకు మిజోరం(Mizoram Assembly Elections 2023) రాష్ట్ర ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Mizoram: మిజోరం ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే..

Mizoram: మిజోరం ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే..

భారత్‌లో అతి తక్కువ నియోజకవర్గాలున్న రాష్ట్రం మిజోరం. ఇక్కడ కేవలం 40 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి. మిజోరంలో అధికారం చేపట్టడానికి మేజిక్ ఫిగర్ 21 స్థానాలు సాధించాలి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలైన జోరం పీపుల్స్ మూమెంట్(ZPM), మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) బరిలో ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రంలో ఆశించినంత బలంగా లేదని పొలిటికల్ నిపుణులు చెబుతున్నారు.

Assembly polls 2023: మిజోరంలో 77.04, ఛత్తీస్‌గఢ్‌లో 70.87 శాతం పోలింగ్

Assembly polls 2023: మిజోరంలో 77.04, ఛత్తీస్‌గఢ్‌లో 70.87 శాతం పోలింగ్

మిజోరం, ఛత్తీస్‌గఢ్ తొలి విడత పోలింగ్ ముగిసింది. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 5 గంటల వరకూ 77.04 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌‌లో తొలి విడతగా 20 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా, 70.87 శాతం పోలింగ్ నమోదైంది.

Assembly Elections: నక్సలైట్ల బాంబు దాడి.. పోలింగ్ విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్‌కు గాయాలు

Assembly Elections: నక్సలైట్ల బాంబు దాడి.. పోలింగ్ విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్‌కు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నక్సలైట్లు జరిపిన ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) పేలుళ్లలో పోలింగ్ విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) జవాన్ గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి