Home » Minister Nara Lokesh
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. దైవం అంటే భక్తిలేదు.. దేశమంటే ద్వేషం.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారు... అంటూ మంత్రి లోకేశ్ మండిపడ్డారు.
ఓ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేశ్ అన్ని విధాలా టీడీపీని ముందుకు నడిపిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు ఎన్నో కీలక సంస్కరణలకు యువనేత శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన లోకేశ్‌కు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై ఎక్స్ వేదికగా లోకేశ్ స్పందించారు.
నమ్మకంతో బీసీని అయిన తనకు మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి ఇచ్చినందుకు అధినేత చంద్రబాబుకు పల్లా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అని స్పష్టం చేశారు.
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నారా లోకేశ్‌కు మంత్రులు నారాయణ, అనిత శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకవైపు పార్టీని మరోవైపు తన శాఖను ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తూ లోకేశ్ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు.
గత కొంత కాలంగా మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లను పార్టీలోని కీలక స్థానాలకు తీసుకెళ్తానని లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మాటను నిజం చేస్తూ మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌కు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించేలా యువ నేత కృషి చేశారు.
పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ని నియమించింది.
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబుల ఆశయ సాధనే మన మార్గమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల బృందం ఎవరెస్ట్ శిఖరారోహణకు వెళ్లడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారని నారా లోకేశ్ తెలిపారు. సవాళ్లను అధిగమించి ప్రపంచాన్ని జయించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.