• Home » Medchal–Malkajgiri

Medchal–Malkajgiri

Medchal: రికవరీ బంధు!

Medchal: రికవరీ బంధు!

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 33 ఎకరాల వ్యవసాయేతర భూమికి రైతుబంధు సాయం దక్కింది! ఒక సీజన్‌లో కాదు.. ఏకంగా ఐదేళ్లు! దీనిపై ఫిర్యాదు రావడంతో ఆ సొమ్ము రికవరీకి ఆ జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

Alwal: కడుపునొప్పి భరించలేకే రూపాదేవి ఆత్మహత్య!

Alwal: కడుపునొప్పి భరించలేకే రూపాదేవి ఆత్మహత్య!

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి బలవన్మరణం వెనుక గల కారణాలు బయటకు రాలేదు. అయితే ఆమెకు గైనిక్‌ సమస్యలు ఉన్నాయని, కడుపునొప్పి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులకు తల్లి భూలక్ష్మమ్మ వాంగ్మూలిమిచ్చారు.

Passport: ఐదు రోజులుగా.. పాస్‌పోర్టు సేవలు బంద్‌..

Passport: ఐదు రోజులుగా.. పాస్‌పోర్టు సేవలు బంద్‌..

హైదరాబాద్‌లోని పాస్‌పోర్టు కేంద్రాల్లో ఐదు రోజులుగా సేవలు నిలిచిపోయాయి. బేగంపేట్‌, అమీర్‌పేట్‌, టోలిచౌకిల్లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో స్లాట్‌ బుకింగ్‌ను నిలిపివేశారు. నిజానికి ఆన్‌లైన్‌లో ఈ కేంద్రాలకు సంబంధించిన స్లాట్లు ఉన్నట్లు కనిపిస్తున్నా.. బుకింగ్‌ జరగడం లేదు.

Ghatkesar: లే ఔట్‌ స్థలానికి పాస్‌ బుక్‌లు..

Ghatkesar: లే ఔట్‌ స్థలానికి పాస్‌ బుక్‌లు..

ఆ స్థలం ఎప్పుడో 45 ఏళ్ల క్రితమే వెంచర్‌గా మారిపోయింది. వందల మంది అక్కడ పైసలు పోసి ప్లాట్లు కొనుకున్నారు. ఒకప్పుడు ఊరికి దూరంగా ఉన్న ఆ స్థలాలు.. ఇప్పుడు రూ.కోట్లు పలుకుతున్నాయి. అయితే, అధికారులు చేసిన తప్పిదం వల్ల ఆ లేఔట్‌కు మళ్లీ పట్టా పుస్తకాలు జారీ అయ్యాయి. వాటి ఆధారంగా తెరపైకి వచ్చిన కొందరు.. ఆ లేఔట్‌లోని రూ.50 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని కబ్జా చేశారు.

Rangareddy: రిజిస్ట్రేషన్ల రాబడిలో రంగారెడ్డి టాప్‌!

Rangareddy: రిజిస్ట్రేషన్ల రాబడిలో రంగారెడ్డి టాప్‌!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ చుట్టూ రియల్‌ వ్యాపారం జోరు తగ్గలేదు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల నుంచే అత్యధిక ఆదాయం సమకూరింది. ఈ జిల్లాల్లో డాక్యుమెంట్ల నమోదు కూడా ఎక్కువగానే ఉంటుంది.

Hyderabad: సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు..కార్పొరేట్‌ తరహాలో..

Hyderabad: సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు..కార్పొరేట్‌ తరహాలో..

రాష్ట్రంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అధునాతన భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కెఫెటేరియాలు, వెయిటింగ్‌ లాంజ్‌లు ఇతర హంగులతో కార్పొరేట్‌ ఆఫీసుల తరహాలో ఈ బిల్డింగ్‌లు కట్టాలని భావిస్తోంది.

 TG News: కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు.. 12 మంది మృతి

TG News: కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు.. 12 మంది మృతి

రాష్ట్రవ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు వణికిపోయారు. గాలివాన తీవ్రత ఉమ్మడి పాలమూరులో ఎక్కువగా ఉంది..! నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు.

Hyderabad: మల్లారెడ్డికి మరో షాక్‌!

Hyderabad: మల్లారెడ్డికి మరో షాక్‌!

బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్‌ తగిలింది. మొన్నటికి మొన్న సుచిత్రలోని భూ వివాదం తాలూకు కాక చల్లారకముందే తాజాగా బొమ్మరాసిపేట గ్రామ పరిధిలోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఆయన అక్రమంగా నిర్మించిన ప్రహరీ తెరమీదకొచ్చింది.

Mallareddy: పాలు, పూలు అమ్ముడే కాదు.. మల్లారెడ్డి భూ కబ్జాలూ చేస్తుండు

Mallareddy: పాలు, పూలు అమ్ముడే కాదు.. మల్లారెడ్డి భూ కబ్జాలూ చేస్తుండు

‘మాజీ మంత్రి మల్లారెడ్డి పాలు, పూలు అమ్ముడే కాదు.. భూ కబ్జాలు కూడా చేస్తుండు. ఆయన పేరే భూ కబ్జాల మల్లారెడ్డి. ఆయన కబ్జా చేసిన మా భూమిని మాకు ఇప్పించాలి. మల్లారెడ్డి తన తప్పు ఒప్పుకుని మాకు క్షమాపణ చెప్పి, పదవికి రాజీనామా చేయాలి’ అని బాధితుడు సేరి శ్రీనివాస్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Hyderabad: సుచిత్రలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు..

Hyderabad: సుచిత్రలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు..

హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌ మండలం జీడిమెట్ల రెవెన్యూ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలోని 1.11 ఎకరాల భూ వివాదంలో గొడవకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డిని.. ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. సర్వేనంబరు 82, 83లోని ఈ భూమి మాది అంటూ శ్రీనివాస్‌ రెడ్డి, మరో 15 మంది కలిసి శనివారం తెల్లవారుజామున కోర్టు పత్రాలను వెంటబెట్టుకొని వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి