Home » Mayavati
తమిళనాడులో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధ్యక్షుడిని నడి రోడ్డుపై కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్(Armstrong) చెన్నై పెరంబూర్‌లో నివసిస్తున్నాడు. ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి కత్తులతో నరికి హత్య చేశారు.
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను మరోసారి తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు బీఎస్పీ అధినేత మాయావతి తన రాజకీయ వారసుడి బాధ్యతల నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తొలగించారు. అదేవిధంగా పార్టీలో అన్ని బాధ్యతల నుంచి తప్పించారు. ఎన్నికల తర్వాత మాయావతి తన మనసు మార్చకుని మరోసారి తన రాజకీయ వారసుడిగా ఆకాష్ ఆనంద్ పేరును ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్(UP) ఎన్ని్కల్లో గణనీయమైన సీట్లు సాధిస్తామని ధీమాగా ఉన్న బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అక్కడి లోక్ సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటులో బీఎస్పీ గెలవలేకపోయింది.
దేశవ్యాప్తంగా ఐదో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రధాన పోరు కొనసాగుతున్న వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని టార్గెట్ చేశారు. మరోవైపు అఖిలేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాయావతి. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను మాయావతి తప్పించారు. ఏడాది క్రితం ఇచ్చిన వారసత్వ బాధ్యతల నుంచి కూడా తప్పించినట్లు ప్రకటించారు. దీంతో మాయావతి తీసుకున్న ఈ నిర్ణయంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తొలగిస్తున్నట్లు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు కావడంతో భారతీయ పౌరసత్వం ఉన్న వ్యక్తి దేశంలో ఏ లోక్‌సభ స్థానంలో అయినా పోటీ చేయవచ్చు. మరోవైపు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి స్థిరపడిన వ్యక్తులు అక్కడి రాజకీయాల్లో రాణిస్తున్నవారెందరో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది ఇతర రాష్ట్రాల్లో రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే ఎక్కువ లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం అందరిదృష్టిని ఆకర్షించింది.
కేంద్రంలో అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రం చేస్తామని బీఎస్సీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి(Mayawati) సంచలన ప్రకటన చేశారు.
దళిత ఐకాన్, బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ మాయావతి డిమాండ్ చేశారు. మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, వ్యవసాయ శాస్త్రవేత ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం 'భారతరత్న' ప్రకటించిన కొద్దిసేపటికే మాయావతి తన డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.