Home » Maoist Encounter
భారతదేశ వ్యాప్తంగా బంద్ చేపట్టాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మావోయిస్టు కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈ లేఖను విడుదల చేశారు.
Maoists arrested: పోలీసులకు పట్టుబడిన మావోయిస్టులలో ఒకరు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావ్ అలియాస్ దామోదర్ భద్రతాదళంలో పనిచేస్తున్న మావోయిస్టు మడకం చిట్టీ అలియాస్ కీడో (19)గా పోలీసులు గుర్తించారు. ఈనెల 8న కర్రెగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం తగిలి చిట్టీ గాయపడ్డాడు.
ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య గురువారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేత జూనియర్ హిద్మాను అరెస్టు చేశారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని ఓ అడవీ ప్రాంతంలో పోలీసులతో మావోయిస్టులు ఎదుర్కాల్పులు జరిగి, కీలక నేత జూనియర్ హిద్మా (మోహన్)ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి AK-47 తుపాకీ, 35 రౌండ్ల తూటాలు, 117 డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు.
సుకుమా జిల్లాలో 18 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో హిడ్మా నాయకత్వంలోని పీఎల్‌జీఏ బెటాలియన్‌కు చెందిన నలుగురు నక్సల్స్ ఉన్నారు.
మావోయిస్టులను ఎన్కౌంటర్లో చంపిన తర్వాత వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులు దహనం చేయడాన్ని సామాజికవేత్తలు, వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. మానవహక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ, విచారణ కోరుతూ జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.
Big Shock:చత్తీస్‌గడ్‌లో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. నలుగురు కీలక మావోయిస్టు నేతలతో పాటు మరో 18 మంది సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్, పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారుల ముందు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారికి పోలీసులు నియాద్ నెల్లా నార్ యోజన కింద పునరావాసం కల్పించనున్నారు.
చత్తీస్‌గఢ్ అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన వారి పార్థివదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలని కేంద్రం, చత్తీస్‌గఢ్‌ప్రభుత్వాలను మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలని బంధుమిత్రులు విజ్ఞప్తి చేసినా.. ప్రజా సంఘాలు డిమాండ్లు చేసినా.. ఛత్తీస్‌గఢ్ పోలీసులు వీటిని పట్టించుకోలేదు.
చత్తీగఢ్‌లో నక్సల్ నేత నంబాల కేశవరావు సహా ఆరు నక్సల్స్ మృతదేహాలను పోలీసులు బంధుమిత్రుల లేకపోవడంతో తమంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు మరియు ప్రజాసంఘాలు ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.