Home » Maoist Encounter
ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో.. తెలంగాణకు చెందిన ఓ నక్సలైట్ మృతిచెందారు.
తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్ సరిహద్దులో శుక్రవారం ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా ఓ మావోయిస్టు మృతిచెందినట్టు ములుగు ఎస్పీ శబరీశ్ వెల్లడించారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో మృతి చెందిన 12 మంది మావోయిస్టులను పోలీసులు గుర్తించారు.
రాష్ట్రం సుకుమా జిల్లాలో ఆదివారం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా 210 కోబ్రా బలగాలు జేగురుగొండ పోలీ్‌సస్టేషన్ క్యాంపు నుంచి టేకులగూడెం వైపు ట్రక్కు, ద్విచక్రవాహనాలపై బయల్దేరారు.
వచ్చే రెండు మూడేళ్లలో దేశవ్యాప్తంగా మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు. ఆ క్రమంలో దండకారణ్యం వేదికగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లతో ఆ ప్రాంతమంతా ఎర్రబారుతోంది.
Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) నారాయణపుర్‌లో(Narayanpur District) భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శనివారం ఉదయం సమయంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు.
మావోయిస్టుల ఏరివేత పేరుతో అడవుల్లో బలగాల మోహరింపు.. దానికి కౌంటర్‌గా పోలీసులే లక్ష్యంగా బూబీట్రాప్స్, మందుపాతరలతో నక్సల్స్ ప్రతివ్యూహాలతో ఛత్తీ్‌సగఢ్-తెలంగాణ సరిహద్దు ఏజెన్సీల పౌరులు గజగజ వణికిపోతున్నారు. ఇటీవల వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు ఏసు అనే స్థానికుడు బలవ్వడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు విలవిల్లాడుతున్నారు.
వాజేడు మండలం కొంగాల అటవీప్రాంతంలో జూన్ 4న మందుపాతర పేలిన (Landmine Explosion) ఘటనపై మావోయిస్టులు (Maoists) స్పందించారు. మందుపాతర పేలి ఏసు అనే వ్యక్తి మృతిచెందడం బాధాకరమన్నారు. తమ జాడకోసం పోలీసులే ఏసును అటవీప్రాంతంలోకి పంపి ప్రాణాలు తీశారని ఆరోపించారు.
తమ జాడ కనుగొనేందుకు ఇల్లెందుల ఏసు అనే వ్యక్తిని పోలీసులే అడవిలోకి పంపగా మందుపాతర తొక్కి అతడు మరణించాడని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఏసు మరణానికి పోలీసులే బాఽధ్యులని, బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంటూ
అడవిలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు.. కట్టెల కోసం వెళ్లిన ఓ వ్యక్తి బలయ్యాడు. ఈ సంఘటన ములుగు జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వాజేడు మండలంలోని జగన్నాథపురానికి చెందిన ఇల్లెందుల ఏసు (55) తన కుమారుడు రమేశ్, మరో ముగ్గురితో కలిసి కట్టెల కోసమని కొంగాల అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు.