Home » Maoist Encounter
ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో మరోమారు తుపాకీ గర్జించింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.
తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో ఇవాళ(ఆదివారం) ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతిచెందారు. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ తూటా పేలింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో భద్రతా దళాలు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా 2026, మార్చిలో నెలలోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఒడిశాలోని వివిధ జిల్లాల్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత సవ్యసాచి పాండ తీవ్ర అలజడి సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.
మావోయిస్టుల కంచుకోట అబుజ్‌మడ్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పోలీసులు-నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మరణించగా.. ఇద్దరు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్‌లో అబూజ్‌మడ్ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి కడప జవాన్ సహా ఐటీబీపీ(ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు) దళానికి చెందిన ఇద్దరు మరణించారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలకు ప్రత్యేక బృందాలు మోహరిస్తున్నట్లు వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నారాయణపూర్ జిల్లా దుర్బేరా సమీపంలోని కొడ్లియార్ అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతా సిబ్బందే లక్ష్యంగా బుధవారం ఐఈడీని మావోయిస్టులు పేల్చారు. ఈ పేలుడులో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులను రాయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు.