Home » Manohar Lal Khattar
హర్యానాలోని నుహ్ జిల్లాలో ఇటీవల మత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత నాలుగో రోజు కూడా కొనసాగింది. ఆదివారం ఉదయం నుహ్‌లోని ఓ హోటల్ కమ్ రెస్టారెంట్‌ను అధికారులు కూల్చేశారు. దీనిని చట్టవిరుద్ధంగా నిర్మించారని అధికారులు తెలిపారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది. నల్హర్‌లోని షహీద్ హసన్ ఖాన్ మేవాతీ ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద ఉన్న దాదాపు 20 మెడికల్ స్టోర్స్‌ను అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. వీటిని ప్రభుత్వ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించినట్లు అధికారులు తెలిపారు.
హర్యానాలోని నుహ్ జిల్లా, దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం జరిగిన మత ఘర్షణల వెనుక ‘‘బిగ్ గేమ్ ప్లాన్’’ ఉందని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ చెప్పారు. అయితే లోతైన దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆదరాబాదరాగా ఓ నిర్ణయానికి రాబోమని తెలిపారు. పరిస్థితి మెరుగైన తర్వాత ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామన్నారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో సోమవారం జరిగిన హింసాత్మక ఘర్షణలపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక)లో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. విశ్వ హిందూ పరిషత్, తదితర సంస్థల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన జలాభిషేక యాత్రపై దుండగులు ఉద్దేశపూర్వకంగానే దాడి చేసినట్లు ఈ ఎఫ్ఐఆర్ తెలిపింది.
హర్యానాలోని నుహ్ జిల్లాలో జలాభిషేక యాత్రపై దుండగుల దాడి అనంతరం చెలరేగిన హింసాత్మక ఘర్షణలపై అమెరికా స్పందించింది. హింసాత్మక చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని అన్ని పక్షాలను కోరింది.
రాజస్థాన్‌లో ఇటీవల ఇద్దరు ముస్లిం యువకుల మృతదేహాలు కనిపించినప్పటి నుంచి పరారీలో ఉన్న బజ్‌రంగ్ దళ్ గోసంరక్షణ కార్యకర్త మోను మానేసర్ గురించి రాష్ట్ర పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ తెలిపారు.
రెండు నెలలకు పైగా ఘర్షణలతో మణిపూర్ అట్టుడుకుతున్న తరుణంలో హర్యానాలోని నుహ్ , గురుగ్రామ్లో హింసాకాండ చెలరేగడం, ఆరుగురు ప్రాణాలు కోల్పవడం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలను ఇంటెలిజెన్స్ ముందుగానే ఊహించలేకపోయిందనే అనుమానాలకూ తావిచ్చింది.
హర్యానాలోని నుహ్ హింసాత్మక ఘటనలో నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టార్ తెలిపారు. జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించనున్నట్టు చెప్పారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో సోమవారం ప్రారంభమైన మత ఘర్షణలు సమీపంలోని గురుగ్రామ్‌ను కూడా వణికిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు తమకు ఎదురవుతాయని గురుగ్రామ్ ప్రజలు ఊహించలేదు. రోడ్లపై ఘర్షణలు జరుగుతూ ఉంటే తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. అపార్ట్‌మెంట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో సోమవారం ప్రారంభమైన మత ఘర్షణలు గురుగ్రామ్‌కు విస్తరించాయి. మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లో మరోసారి హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని నగరం ఢిల్లీకి అతి సమీపంలోనే గురుగ్రామ్ ఉండటంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.