Home » Manda Krishna Madiga
Andhrapradesh: మాజీ సీజేఐ ఎన్వీ రమణతో ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ శనివారం భేటీ అయ్యారు. ఎన్వీ రమణ సీజేఐగా ఉన్నప్పుడు సుప్రీంలో ఎస్సీ వర్గీకరణ కేసు విచారణ జరిగింది. పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును విచారణకు అనుమతించి సీజేఐగా ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ఎన్వీ రమణ పంపించారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ముప్పై ఏళ్లుగా చేసిన నిరంతర పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని ఎల్బీనగర్ ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జి సుధాకర్‌మాదిగ(LB Nagar MMRPS Incharge Sudhakarmadiga) హర్షం వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించిన ఎంఆర్‌పీఎస్(MRPS)కు ధర్నాచౌక్ అడ్డాగా మారింది. 30 ఏళ్ల పాటు జరిగిన వర్గీకరణ పోరాటంలో ఎన్నో ఆందోళనలు ఇక్కడే జరిగాయి. రిజర్వేషన్ల వర్గీకరణకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994 జూలై 7న ఉద్యమాన్ని ప్రారంభించింది.
మూడు దశాబ్దాలకుపైగా అలుపెరగని ఉద్యమం! అనేక బలిదానాలు... వేలాది కేసులు! భారీ బహిరంగ సభలు! నిరాహార దీక్షలు... చైతన్య యాత్రలు! ఏళ్లు గడుస్తున్నా వెనుకడుగు వేసిందే లేదు! గమ్యం చేరేదాకా తగ్గేదే లేదు. ఇది.. ఎమ్మార్పీఎస్ ‘వర్గీకరణ’ ఉద్యమం సాగిన తీరు.
ఎస్సీ వర్గీకరణ కోసం అకుంఠిత దీక్షతో పోరాడామని, ఈ ప్రయాణంలో ఎందరినో కోల్పోయామని, చివరికి ధర్మమే గెలిచిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు.
ఎస్సీ వర్గీకరణ కోసం అకుంఠిత దీక్షతో పోరాడామని, ఈ ప్రయాణంలో ఎందరినో కోల్పోయామని, చివరికి ధర్మమే గెలిచిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు.
కొన్ని దశాబ్దాలుగా దేశంలో రగులుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు తెరవేసింది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ఉప వర్గీకరణ ఆమోద యోగ్యమేనని, ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉప వర్గాల వారికి రాష్ట్రాల స్థాయిలో కోటాలో ప్రత్యేక కోటా ...
మూడు దశాబ్ధాల పోరాటం ఫలించింది. ఎందరో నాయకుల ఆకాంక్ష నెరవేరింది. 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు.. తమ హక్కుల కోసం పోరాటం.. తమ కళ నెరవేరిందనుకున్న సమయంలో న్యాయస్థానం రూపంలో అడ్డంకులు.. వెరసి.. మరో 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Andhrapradesh: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పందించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ... గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చేసిన ఎస్సీ వర్గీకరణపై ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అది ఏపీలో అమలు అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగా తెలిపారు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు.. అలా చేయడం వల్లే ఎంతో మంది ఎస్సీలకు ఉద్యోగాలు దక్కాయన్నారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు అలా చేయకుంటే.. ఎస్సీల పరిస్థితి మరోలా ఉండేదన్నారు.