Home » Mancherial
బాలికలందరు స్వీయ రక్షణ పాటిస్తూ జాగ్రత్తగా మెలగాలని వెల్గనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి సూచించారు. మంచిర్యాలకు చెందిన భరోసా సహాయక కేంద్రం ఆధ్వర్యంలో వెల్గనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం బాలికలకు అవగాహన కల్పించారు.
మం డలంలోని శివలింగాపూర్ గ్రామంలో గురువారం ఫారెస్టు డిప్యూటీ రేంజ్ అధికారి ప్రభాకర్ వన్య ప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిం చారు. ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని, విద్యుత్ వైర్లు, ఉచ్చులు, ఉరులు బిగించి వన్యప్రాణులను చం పితే కఠినచర్యలు తీసుకొంటామన్నారు.
మంచిర్యాల జిల్లాలో పులుల సంచారం క్రమంగా పెరుగుతోంది. లక్షెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచరించగా, తాజాగా బెల్లంపల్లి ఫారెస్టు డివిజన్ పరిధిలో చిరుతపులి కనిపించింది. అటవీ అధికారులు పులుల సంచారాన్ని ద్రువీకరించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు ఎప్పు డు ఏం జరుగుతోందనని భయాందోళనకు గురవుతు న్నారు.
దివ్యాంగుల సంక్షేమం దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్స వంలో భాగంగా దివ్యాంగులను సన్మానిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల పరి రక్షణ హక్కులపై అవగాహన కలిగి ఉం డాలని, ప్రత్యేక కమ్యూనిటీ హాలు ఏర్పాటుపై చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీలో మంగళవారం అధికారులు, పాఠ శాలల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాయల్ టాకీస్ చౌరస్తా నుంచి సీసీసీ కార్నర్ వరకు ర్యాలీ సాగింది. రోడ్లపై చెత్తను వేయవద్దని, మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని నినాదాలు చేశారు.
పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.10 కోట్ల నిధులను కేటాయించినట్లు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.10 కోట్లతో ప్రణాళి కలు తయారు చేశామన్నారు.
దివ్యాంగ విద్యార్థులు సాధారణ పిల్లలతో సమానంగా రాణించాలని డీఈవో యాదయ్య అన్నారు. మంగళ వారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భం గా భవితా కేంద్రంలో నిర్వహించిన దివ్యాంగ దినోత్సవ వేడుకల్లో మాట్లాడారు. ప్రతీ వ్యక్తి లక్ష్యసాధనకు చదు వు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
తెలంగాణలోని మంచిర్యాల రైల్వేస్టేషన్ కొత్తరూపు సంతరించుకోనుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.26.49 కోట్లతో మంచిర్యాల రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.
యాసంగి సాగుకు రైతులు సమాయత్తమయ్యారు. అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో సాగు పనులకు శ్రీకారం చుట్టారు. వరి నాడు మడులు వేసుకొని నాట్లు వేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. శనగలు, మక్కలు, మినుములు విత్తుకుంటున్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యే విఫలమయ్యారని, ప్రజలను మోసం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఛార్జ్‌షీట్ విడుదల చేసి మాట్లాడారు.