Home » Mancherial
తెలంగాణ ఉద్యమం సంద ర్భంగా రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి విగ్రహాల రూపురేఖలను మార్చవద్దని నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు క్షీరాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం అం దరూ ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టారన్నారు.
రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ ఆరోపించారు. నస్పూర్‌లోని జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గురుకుల బాట జిల్లా ఇన్‌చార్జీ చైతన్య, రాష్ట్ర నేత నడిపెల్లి విజిత్ కుమార్‌తో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రకృతి వైపరీత్యానికి జిల్లాలోని రైతులకు తీరని నష్టం వాటి ల్లింది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన వరి, పత్తి పం టలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షానికి తడిసి పోవడంతో నష్టం వాటిల్లింది. శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి జిల్లాలోని వేమనపల్లి, బెల్లంపల్లి, దండేపల్లి, జన్నారం మండలాల్లో అధిక నష్టం వాటిల్లి నట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజులుగా వాతావరణం మబ్బులు పట్టి ఉండటంతో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పంట నీళ్ల పాలయిందని రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య అందిస్తున్నట్లు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. శనివారం మండలంలోని ఇందారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు కష్టపడి కాదు, ఇష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
విద్యార్థులు చట్టాలపై అవగా హన కలిగి ఉండాలని లక్షెట్టిపేట సివిల్ కోర్టు న్యాయాధికారి మహ్మద్ అసదుల్లా షరీఫ్ అన్నారు. శనివారం రాఘవేంద్ర విద్యాసంస్థల ఆధ్వ ర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు.
ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టే కోనోకార్పస్ మొక్కలను మున్సిపల్ అధికారులు ఎట్టకేలకు తొలగించారు. పచ్చదనం కోసం జిల్లా కేంద్రంలోని డివైడర్ల మధ్య పెంచుతున్న కోనోకార్పస్ మొక్కలు ఆరోగ్యరీత్యా ప్రమాదకరమని, వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని పేర్కొంటూ ’ఆంధ్రజ్యోతి’లో ‘కోనోకార్పస్ మొక్కలతో ముప్పే’ శీర్షికన ఈ నెల 1న వార్తా కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు శనివారం సిబ్బందితో వాటిని తొలగించారు.
ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణం పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో యూనియన్ జేఏసీ అధ్యక్షుడు కట్ట రామ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గంలో ఆటోల బంద్ పాటించారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటోలకు గిరాకీ లేకుండా పోయిందని తెలిపారు.
మంచిర్యాల- వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే-163 పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. హైవే నిర్మాణానికి సేకరించిన భూముల్లో ట్రెంచ్ తవ్వకాలు 70 శాతం మేర పూర్తికాగా, రైతులకు నగదు చెల్లింపులు అంతే శాతం పూర్తయ్యాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసం ధానం చేస్తూ నాలుగు వరుసలు గల నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే-163ని సుమారు 400 కిలోమీటర్ల మేర నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, కల్పించాలని శుక్రవారం ఐబీ చౌరస్తాలో ధర్మ సమాజ్‌పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ప్రజలందరికి నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించాల న్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని శుక్రవారం ఐబీ చౌర స్తా నుంచి లక్షెట్టిపేటలోని ఉత్కూరు చౌరస్తా వరకు సైకిల్ యాత్ర చేప ట్టారు. జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి బీసీల చిరకాల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు.