Home » Mamata Banerjee
పశ్చిమ మేదినిపూర్ జిల్లాలోని కేషియారిలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, తనపై తప్పుడు కేసులు బనాయించడం ద్వారా భవనాపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని చెల్లకుండా చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భవానీ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మమతా బెనర్జీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మమతా బెనర్జీ సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తి వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళితే..
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి టీఎంసీ అభ్యర్థిగా బుధవారంనాడు నామినేషన్ వేశారు. పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఆమె వెంట హాజరయ్యారు.
ఈసారి యుద్ధం అంటూ జరిగితే కోల్‌కతాపై దాడి చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరిని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ తప్పుపట్టారు. మోదీ మౌనాన్ని పశ్నించారు. తక్షణం ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 'మహా ఆటవిక రాజ్యం' నడుస్తోందని, ఈ ఘటనలను టీఎంసీ బాధ్యత వహించాలని మోదీ అన్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్ సమీపంలో ఒక డ్రోన్ కనిపించడం సంచలనమైంది. మాల్దాలోని మాలతీపూర్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని గజోల్ వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కబోతుండగా సమీపం నుంచి ఒక డ్రోన్ అనుమానాస్పదంగా ఎగురుతూ కనిపించింది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ బీజేపీపై మరోసారి నిప్పులు చెరిగారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
భారతీయ జనతా పార్టీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. బీజేపీని 'అనాగరిక' పార్టీగా అభివర్ణించారు. దేశంలో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను టార్గెట్ చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని వేధింపులు, అవమానాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలు కనీసం మాంసం, గుడ్లు తినే పరిస్థితి కూడా ఉండదని అన్నారు.
పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల వాతావరణం శనివారంనాడు ఒక్కసారిగా వేడెక్కింది. ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రధానాస్త్రంగా చేసుకుని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారం సాగించగా, శ్రీరామ నవమి ఊరేగింపులో అల్లర్లు, చొరబాటుదార్ల సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రచారం జరిపారు.