Home » Mallu Ravi
అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి దొరికిపోయిన దొంగ కేటీఆర్ అని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. మతిస్థిమితం కోల్పోయి సీఎం రేవంత్‌పై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) కన్వీనర్‌గా సీనియర్ ఎంపీ మల్లు రవిని ఆ పార్టీ అధినాయకత్వం నియమించింది. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా సీపీపీ కన్వీనర్లను నియమించారు.
ఎన్డీయే ప్రభుత్వం చర్చలు లేకుండానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగించిందని కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, సంబల్, మణిపూర్ సహా ప్రజా సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్ చేసినప్పటికీ పట్టించుకోలేదని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్ చేశారు. ‘
ప్రభుత్వం సాఫీగా నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తేనే మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్‌లను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తాము తప్పులేకుండా స్వేచ్ఛగా ప్రజాపాలన చేస్తున్నామన్నారు. 6 గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని మల్లు రవి వివరించారు.
రైల్వే సవరణ బిల్లు కాగితాలకే పరిమితమైందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. రైల్వేలో పారదర్శకత కోసం స్వతంత్ర రెగ్యులేటరీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను కేంద్ర విస్మరించిందన్నారు.
లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను కేవలం తెలంగాణలో ఎన్నికల ఖర్చుల కోసం రూ.7 వేల కోట్లకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అమ్ముకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆక్షేపించారు. రాజకీయాల్లో హుందాతనం అవసరమని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బుద్ధితెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యతో సీఎం రేవంత్‌రెడ్డికి గానీ, ఆయన సోదరులకు గానీ ఎలాంటి సంబంధం లేదని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు.
లగచర్ల ఘటన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుట్ర అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. గిరిజనులను ఢిల్లీకి తీసుకుపోయి దొంగనే.. దొంగా దొంగా అన్నట్లుగా బీఆర్‌ఎస్ పార్టీ తీరు ఉందన్నారు.