Home » Malkajgiri
తమ సిటింగ్ స్థానమని అధికార కాంగ్రెస్, ఎమ్మెల్యేలంతా తమ వాళ్లేనని బీఆర్‌ఎస్, ప్రధాని మోదీ ఇమేజ్ కలిసివస్తుందని బీజేపీ.. ఇలా ఎవరికి వారు మల్కాజిగిరిలో గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ స్థానాలను.. వాటితోపాటు మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులేస్తోంది.
బీజేపీతోనే అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమని మల్కాజిగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. మంగళవారం మల్కాజిగిరికి చెందిన టీడీపీ నాయకులు, అడ్వకేట్ సుధీర్, ఫోరమ్ ఫర్ బెటర్ మల్కాజిగిరి ఉపాధ్యక్షుడు రాకేష్ తదితరులు ఈటల సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వనించారు.
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌నో, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డినో గెలిపించడం కోసం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ సంకల్పం కోసమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా(Jagat Prakash Nadda) తెలిపారు.
మల్కాజ్‌గిరి అభివృద్ధి నా భాద్యత అంటూ ప్రజలకు మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(BJP candidate Etala Rajender) హామీనిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నాలుకకు నరం లేకుండా హామీలు ఇస్తున్నారని, ఆగస్టులో తప్పకుండా రైతు రుణమాపీ చేస్తానంటూ నమ్మబలికిస్తున్నాడని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా తెలిసిన వాడిగా నమ్మలేకపోతున్నానని ఈటల రాజేందర్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి(Malkajigiri)ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. తొలుత జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్‌పై అసమ్మతిని పెట్టి పీఠాన్ని కైవసం చేసుకుంది.
గ్రేటర్ హైదరాబాద్‌లో(Hyderabad) మూడు ఎంపీ సీట్లపై కమలం(BJP) పార్టీ దృష్టి పెట్టింది. ఈసారి మూడు స్థానాలను కైవసం తీసుకునే దిశగా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు చోట్ల బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపింది. ముగ్గురు అభ్యర్థులు అప్పుడే విస్తృతంగా తమ నియోజకవర్గాల్లో(Parliament Constituency) పర్యటిస్తున్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రచారంలో ముందంజలో ఉంది. ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఒకసారి..
లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మల్కాజిగిరి (Malkajgiri)లో కాంగ్రెస్ గెలుపు తనకు మరింత బాధ్యతను పెంచుతుందని అన్నారు. తన బలం, బలగం ఇక్కడి నేతలేనని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇక్కడ ఎంపీ సీటు గెలవాల్సిందేనని అన్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్‌గిరిదని వివరించారు. తాను సీఎంగా ఉన్నానంటే ఆ గొప్పతనం ఇక్కడి నాయకులదేనని తెలిపారు.
Telangana Elections: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యాక.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు కాపాడుకోవాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కచ్చితంగా ఆశించిన సీట్లను దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆచితేచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు...
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. పది రోజుల వ్యవధిలో మోదీ రెండోసారి రాష్ట్రానికి వస్తున్నారు. మూడు రోజుల పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు.