Home » Malkajgiri
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)కు కూతవేటు దూరంలో ఉన్న మల్కాజిగిరి రైల్వేస్టేషన్(Malkajgiri Railway Station) అభివృద్ధితో రూపురేఖలు మారనున్నాయి. అమ్రిత్ భారత్ స్టేషన్ సికింద్రాబాద్‌స్కీంలో భాగంగా ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు సంబందించి నిర్మాణాలు చకచక జరిగిపోతున్నాయి.
ఆకలి ఉన్నవారికే అధికారం రావాలని, ప్రజల ఆకలి సమస్యలు అర్థం చేసుకోవడమే నిజమైన అంబేడ్కర్ స్ఫూర్తి అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) అన్నారు. చైతన్యం, త్యాగాలు, ప్రజాస్వామ్యం లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదన్నారు. అధికారం కొనుక్కుంటే వచ్చేది కాదన్నారు.
భారతదేశమే కాకుండా ప్రపంచం మెచ్చిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మాగాంధీ అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) పేర్కొన్నారు. రక్తపు బొట్టు చిందించకుండా దేశానికి స్వాతంత్రం సాధించడం ద్వారా ప్రపంచానికి అహింస పద్ధతితో పోరాటం అనే ఆయుధాన్ని గాంధీ అందించారని ఆయన అన్నారు.
దేశంలో వ్యవసాయం, దుస్తులు ఆఖరికి ఇల్లు కావాలన్నా.. జీవించడానికి కావాల్సిన ప్రతి ప్రధాన పని విశ్వకర్మలతోనే ముడిపడి ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) పేర్కొన్నారు.
కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రాయితీ రైల్వేపా్‌సలను పునరుద్ధరించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు.
రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎగిరేది కాషాయ జెండానే అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలోని పద్మావతి ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సభ్యత్వ నమోదు వర్క్‌షాపు నిర్వహించారు.
వక్ఫ్‌బోర్డు స్థలాన్నే కబ్జాల నుంచి కాపాడుకోలేని దుస్థితిలో వక్ఫ్‌బోర్డు పనిచేస్తోందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరెడ్డి(Malkajgiri MLA Marri Rajashekha Reddy) ఆరోపించారు. కబ్జా చేసిన వారికి పోలీసులు వత్తాసు పలకడం వెనుక ప్రభుత్వ పెద్దలెవరున్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభంకావడంతో భక్తులు పరమశివుడి సేవలో తరిస్తున్నారు. కార్తీక రెండో సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లజోలికొస్తే సహించేది లేదు ఖబడ్దార్ అంటూ బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(BJP Malkajigiri MP Etala Rajender) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూల్చివేతలను అడ్డుకుని తీరతామన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు శని, ఆదివారాలు వస్తే బిక్కుబిక్కుమని జీవితాలు గడిపే దుస్థితి నెలకొందన్నారు.
సచివాలయం బఫర్ జోన్లో కట్టలేదా.. అంటూ ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం అత్తాపూర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.