Home » Mahesh Kumar Goud
బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంస పాలనలో అస్తవ్యస్తంగా మారిన తెలంగాణను కాంగ్రెస్ సర్కారు సరిచేస్తూ వికాసం వైపు పరుగులు తీయిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని, ఆమె లేనిదే ప్రత్యేక రాష్ట్రం లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహే్‌షకుమార్ గౌడ్ అన్నారు. డిసెంబరు 9న సోనియా జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియేట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి రేవంత్ రెడ్డి గౌరవం ఇస్తూ విగ్రహాన్ని పెట్టిస్తున్నారని షబ్బీర్ అలీ తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరే అవకాశం ఉందని, అయితే పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని స్పష్టం చేశారు.
ఏడాది కాంగ్రెస్ పాలనపై బీజేపీ విడుదల చేసిన చార్జ్‌షీట్‌ను చూస్తుంటే గురివెంద సామెత గుర్తుకు వస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన మూడ్రోజుల రైతు పండుగ విజయవంతం కావడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అభినందించారు.
ప్రభుత్వ పథకాలు, చేస్తున్న మంచి పనులను గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఆదివాసీ కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు.
గత ఏడాది కాలంగా రాష్ట్రంలో దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం నడుస్తోంది. కానీ, బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం ‘ప్రజల వద్దకు పోతాం.. ఉద్యమం చేస్తాం.. నిలదీస్తాం’ అంటూ రకరకాల ప్రకటనలు చేస్తోంది.
పార్టీలో కష్టపడిన నాయకులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కింద స్థాయి కేడర్ కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కోసం కష్టపడిన వారిని కీలక పదవుల్లో నియమిస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పనైపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే అది గ్రామ స్థాయి నాయకుల కృషి ఫలితమేనని చెప్పారు.