Home » Mahanadu 2025
Mahanadu 2025: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంటగదిలో మహిళల కష్టాలు చూడలేకా నాటి సీఎంగా ఉన్న చంద్రబాబు దీపం పథకాన్ని తీసుకొచ్చారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలకు మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తున్నారని తెలిపారు.
CBN Warns: మహానాడు వేదికగా కోవర్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా.. ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు.
TDP Mahanadu 2025: మళ్ళీ జన్మ అంటూ ఉంటే తెలుగువాడి గానే పుట్టాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అని.. వారే తనకు హైకమాండ్ అని చెప్పుకొచ్చారు.
TDP Mahanadu 2025: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహంపై పూలుజల్లి నివాళులర్పించారు. తెలుగుజాతి ఆరాధించే మహానేత ఎన్టీఆర్ అని సీఎం కొనియాడారు.
TDP Mahanadu 2025 Live: కడప జిల్లాలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సహా టీడీపీ శ్రేణులు తండోపతండాలుగా తరలివచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
California NRIs Mahanadu: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రవాసాంధ్రుల సారథ్యంలో మినీ మహానాడు వేడుకలు సందడిగా సాగాయి. బే ఏరియాలో వెండితెర ఇలవేల్పు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మే 28వ తేదీన దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ఎన్టీఆర్ జయంతిని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ విజయానంద్ ప్రత్యేక జీవో జారీ చేశారు.
టీడీపీ ముఖ్య నేతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తొలి రోజు మహానాడు జరిగిన తీరుపై సమీక్షించారు. మొదటి రోజు మహానాడు గ్రాండ్ సక్సెస్ అంటూ చంద్రబాబు కితాబిచ్చారు.
తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కడపలో అంగరంగ వైభవంగా జరిగే మహానాడు చారిత్రక రాజకీయ పండుగ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
సీఎం చంద్రబాబుకి ఆపదలో ఉన్న కార్యకర్తలకు సాయం చేసి ఆదుకోవడమే తెలుసునని ఏపీ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. కార్యకర్త, నాయకుడికి ఏ కష్టం వచ్చినా భరోసాగా చంద్రబాబు, లోకేష్ నిలిచారని పేర్కొన్నారు.