Home » Mahabubnagar
నిలువు రాళ్లుగా పిలిచే అద్భుతానికి యునెస్కో గుర్తింపు ఇక చాలా దూరంలో లేదు. క్రీస్తు పూర్వం ఐదు వందల ఏళ్ల నాడు మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలోని పరివాహక ప్రాంతంలో నిక్షిప్తమైన మెగా లిథిక్స్ స్టోన్స్‌కు యునెస్కో ఇప్పుడు తాత్కాలిక లిస్ట్‌లో చోటు కల్పించింది.
చారిత్రక నిలువురాళ్లను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దేశంలోని మరో ఐదు ప్రదేశాలతో కలిపి నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని ముడుమాల్‌లో ఉన్న నిలువురాళ్లను కూడా ఎంపిక చేశారు.
అన్ని జిల్లాల్లోనూ 37 డిగ్రీలకు పైగానే ఎండ తీవ్రత కనిపించింది. వచ్చే 2రోజులు ఎండ తీవ్రత అలాగే ఉంటుందని హెచ్చరించింది. ఒకటి రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్నింటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
చేసిన అప్పులు తీర్చి.. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏడారి దేశం వెళ్లిన మరో తెలంగాణ ప్రవాసీ జీవితం విషాదాంతంగా ముగిసింది.. 16 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లిన అతడు.. చివరికి శవంలా తిరిగొస్తున్నాడు..
కుంభమేళా సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లివచ్చే ప్రత్యేక రైళ్ల రాకపోకల సుగమం కోసం 28 ఎంఈఎంయూ, డీఈఎంయూ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.
SLBC Tunnel Tragedy: గత వారం రోజులుగా టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. చివరకు టన్నెల్‌లో ప్రమాదంలో ఆ ఎనిమిది ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా వెనక టైరు పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
నార్సిమోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎన్‌ఎంఐఎంఎ్‌స) వర్సిటీలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 18 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు.
గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ జనరల్ గురుకులంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది.
తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా ఉందని డీజీపీ జితేందర్ చెప్పారు.