Home » Madhya Pradesh
ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ పయనిస్తోంది. కన్వార్ యాత్ర జరిగే మార్గంలో ఆహార పదార్థాలు విక్రయించే యజమానులు విధిగా తమ పేర్లను బోర్డు మీద ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ స్పష్టం చేసింది. ఆ క్రమంలో ఉజ్జయిని మున్సిపల్ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. షాపు యజమానులు బోర్డు మీద విధిగా తమ పేరు, మొబైల్ నంబర్ ప్రదర్శించాలని స్పష్టం చేసింది.
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మైనర్ బాలికపై ఓ నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి, కారులో ఎక్కించుకొని..
కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని 49 జిల్లాలతో రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాజస్థాన్ గిరిజన సమాజం కోరుతోంది. ఇందులో మెజార్టీ జిల్లాలను రాజస్థాన్ నుంచి అడుగుతోంది. రాజస్థాన్‌లో 33 జిల్లాలు ఉండగా 12 జిల్లాలను ఇవ్వాలని స్పష్టం చేసింది. కొత్త రాష్ట్రం కోసం ఆదివాసి పరివార్ సహా 35 గిరిజన సంఘాలు ఉద్యమ బాట పట్టాయి.
తనకున్న కొద్ది భూమిని స్థానిక మాఫియా లాగేసుకుంది. తనకు జరిగిన అన్యాయాన్ని జిల్లా ఉన్నధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా.. వారు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో అతడికి తోచలేదు. ఆ క్రమంలో ఇప్పుడు మనం ఏం చేయాలని ప్రశ్నించుకొంటూ రైతు కలెక్టర్‌లో పొర్లు దండాలు పెట్టడం ప్రారంభించాడు.
కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) రాజ్‌గఢ్(Rajgarh) 2024 లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) ప్రక్రియను సవాల్ చేస్తూ జబల్‌పూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రాంతంలో ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఓ గిరిజన యువకుడిపై పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తించారు. పెళ్లి జరిగే సమయంలో కనికరించలేదు. వివాహ ఊరేగింపు జరుగుతుండగా స్టేషన్ తీసుకెళ్లారు. అప్పటి వరకు బాగానే ఉన్న యువకుడు.. స్టేషన్ వెళ్లాక ఛాతీలో నొప్పి అని చెప్పాడట.. ఆస్పత్రికి తీసుకెళ్లామని, ఫలితం లేదని పోలీసులు కట్టు కథ అల్లారు. ఈ విషయం చెబుతూ ఆ యువకుడి బంధువులు మండిపడ్డారు.
మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజశాల-కమల్ మౌలా మసీదు సముదాయం కింద 94కి పైగా విరిగిన విగ్రహాలు దొరికినట్లు భారతీయ పురావస్తు విభాగం (ఏఎస్ఐ ) తన శాస్త్రీయ సర్వేలో తేల్చిందని న్యాయవాది హరిశంకర్ జైన్ తెలిపారు.
ఉద్యోగాల ప్రస్తావన వచ్చినప్పుడు.. దాదాపు రాజకీయ నేతలందరి స్వరం ఒకేలాగా ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా ఉద్యోగాలిస్తామని హామీ ఇస్తారు. అందుకోసం..
మధ్యప్రదేశ్ హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ ఆర్య బీజేపీలో చేరారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి రాఘవేంద్ర శర్మ కాషాయ కండువా కప్పి జస్టిస్ రోహిత్ ఆర్యను పార్టీలోకి ఆహ్వానించారు.
‘మనసు మంచిదైతే చాలు కలర్ ఏముందిలే’ అనే డైలాగ్ సినిమాల్లో బాగానే అనిపిస్తుంది కానీ.. రియాలిటీలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అందరూ కాదు కానీ..