Home » Machilipatnam
ఆంధ్రప్రదేశ్: కృష్ణా జిల్లా మచిలీపట్నం పంపుల చెరువు కాలనీకి చెందిన ఓ బాలిక 8వ తరగతి చదువుతూ స్థానికంగా నివాసం ఉంటోంది. అయితే అదే ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు మద్యం, గంజాయి సేవిస్తూ కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లి వస్తున్న బాలికపై ఆ గంజాయి బ్యాచ్ కన్నుపడింది.
అరెస్టు కాకుండా ఉండేందుకు పేర్ని నాని కుటుంబం రాజకీయ పలుకుబడితో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 20 రోజులకుపైగా నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది పోలీసులు, కూటమి నేతల సహకారం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
గోదాముల నుంచి పీడీఎస్ బియ్యం మాయం కేసులో నోటీసులు జారీ అయినా మాజీ మంత్రి పేర్ని నాని ఆదివారం పోలీసుల ముందు హాజరు కాలేదు.
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారంనాటికి వాయిదా పడింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం (బందరు) తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఆహ్వాన కమిటీ వాళ్ల ఆహ్వానం మేరకే తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని, జోగి రమేష్ వస్తున్నారన్న సమాచారం తనకు ఏ మాత్రం తెలియదని.. తాను అక్కడకు వెళ్లిన తర్వాత జోగి రమేష్ వచ్చారని కొనకళ్ల నారాయణరావు వివరించారు.
వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం (బందరు) తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
కృష్ణా జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సివిల్ సప్లయి గోదాంలో బియ్యం అవకతవకలపై ప్రధాన నిందితురాలిగా పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం చోటు చేసుకుంది. మంత్రి సోదరుడు కొల్లు వెంకటరమణ(64)కు బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రేషన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దందా బయటపడింది. పౌరసరఫరాల శాఖకు ఆయన అద్దెకు ఇచ్చిన గోదాముల్లో సుమారు 250 టన్నుల బియ్యం మాయమైంది.
ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి వరి రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు! మధ్యవర్తులు, మిల్లర్లు కుమ్మక్కై ధాన్యంలో తేమ శాతం, ఇతరత్రా కారణాలు చూపి మద్దతు ధరలో భారీగా కోత పెడుతున్నారు.