Home » Lok Sabha
Budget 2025: కేంద్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. వలసలు అరికట్టడంపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారు. మూడు రకాల పప్పు ధాన్యాల్లో స్వయం సంవృద్ధి సాధించామన్నారు. బిహార్లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వంటి నేతల నోట వెలువడిన పదాలు జనాన్ని ఉత్సాహపరిచాయి.
మోదీ నినాదం 400+ నినాదం విఫలమవడానికి రాహుల్ గాంధీయే కారణమని కాంగ్రెస్ గట్టిగా చెప్తున్నది. ఎన్డీయే కూటమికి 400కు పైగా స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని ప్రజలకు వివరంగా చెప్పగలిగారని ఆ పార్టీ నేతలు సంతోషిస్తున్నారు.
ప్రజల నాడిని చాకచక్యంగా పట్టగలిగే సెఫాలజిస్టులు, విశ్లేషకులు ప్రకటించిన ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అసలు ఫలితాల్లో విఫలమయ్యాయి.
ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదీ వరకూ హిందువులు, మైనారిటీలపై హింసాత్మక ఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్లో 2,200 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాకిస్థాన్లో 112 కేసులు నమోదయ్యాయి.
జమిలి ఎన్నికల బిల్లులను ప్రవేశపెట్టేందుకు నూతన పార్లమెంట్ భవనంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ జరిగింది. ఈ రెండు బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపనున్నారు.
'ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు'ను డిసెంబర్ 12న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల ఆలోచన చరిత్రాత్మకమని ప్రభుత్వం చెబుతోంది. పార్లమెంటు నుంచి స్థానిక సంస్థల వరకూ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని అంటోంది.
ఆర్టికల్ 26 దేశ ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని చెబుతోందని, మతపరమైన, స్వచ్ఛంద సేవా కార్యకలాపాల కోసం సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఆ ఆర్టికల్ దేశ ప్రజలకు ఇచ్చిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కుటుంబం రాజకీయ ప్రయోజనాల కోసం పదేపదే రాజ్యాంగ సిద్ధాంతాలను బలహీనపరుస్తూ వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.
రాజ్యాంగం తెరిచినప్పుడు అంబేద్కర్, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఆలోచనలు, వారి మాటలు అందులో కనిపిస్తాయని రాహుల్ అన్నారు. మన రాజ్యాంగం ఆలోచనల సమాహారమని, జీవిత తత్వశాస్త్రం, మన సంస్కృతికి సంబంధించిన ఆలోచనలో రాజ్యాంగంలో ప్రతిబింబిస్తాయని చెప్పారు.