Home » Lok Sabha
దేశ ప్రజల మద్దతు బిల్లుకు ఉందని లోక్సభలో చర్చ సందర్భంగా అధికార పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే, ఇది రాజ్యాంగ విరుద్ధమని, మతపరమైన వ్యహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
ముస్లింల మత పరమైన కార్యక్రమాల్లో, వాళ్లు విరాళాలుగా ఇచ్చిన ఆస్తుల్లో జోక్యం చేసుకుంటామనేది కూడా పూర్తిగా అపోహేనని, కేవలం ముస్లింల ఓటు బ్యాంకు కోసమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని కేంద్రం హోం మంత్రి అమిత్షా అన్నారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
కాంగ్రెస్ హయాంలోనే వక్ఫ్ ఏర్పాటైందని, వక్ఫ్ ఏమి చేసినా సరైనదేనని ఆ పార్టీ భావిస్తూ వచ్చిందని, వక్ఫ్ భయాల నుంచి విముక్తి కలిగించేందుకు ఇదే సరైన తరుణమని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అన్నారు.
బిల్లుపై చర్చలో రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, బిల్లుకు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షం పదపదే అభ్యంతరాలు చెబుతుండటం తనకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ముస్లిం కమ్యూనిటీ సంక్షేమం నుంచి ఏ అనివార్యతల కారణంగా వెనక్కి మళ్లారని ప్రశ్నించారు.
వక్ఫ్ బిల్లు బుజ్జగింపు బిల్లు కాదని, అభ్యున్నతి బిల్లు అని ఏక్నాథ్ షిండే శివసేన పార్టీ ఎంపీ శ్రీకాంత్ షిండే అన్నారు. ఈ బిల్లు దేశం కోసం ప్రవేశపెట్టిన బిల్లే కానీ నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా తీసుకువచ్చినది కాదని చెప్పారు.
బిల్లులో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలనే సవరణతో సహా అన్ని సవరణలకు టీడీపీ సానుకూలంగా ఉంది. వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని మూడులైన్ల విప్ను కూడా టీడీపీ జారీ చేసింది.
వక్ఫ్ సవరణ బిల్లు-2024ను బుధవారంనాడు ప్రశ్నోత్తరాల సమయం అనంతరం లోక్సభలో ప్రవేశపెడతారని, దీనిపై 8 గంటలసేపు చర్చ జరపాలని బీఏసీ సమావేశం నిర్ణయించిందని, అవసరాన్ని బట్టి సమయం పొడిగించే వీలుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
కేంద్రప్రభుత్వం 2024లో వక్ఫ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లను ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నేపథ్యంలో జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లును పంపింది.
కేంద్రం త్వరలో 'సహకార్ ట్యాక్సీ' సేవను ప్రారంభించనున్నట్లు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ విధానంలో స్థానిక సహకార సంఘాలు అగ్రిగేటర్ల పాత్ర పోషిస్తాయి, తద్వారా డ్రైవర్లకు ఎక్కువ లాభాలు, ఆర్థిక భద్రత మరియు స్వాతంత్ర్యం కలుగుతుంది