Home » Lok Sabha
న్యూఢిల్లీలో వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో న్యూఢిల్లీలో మౌలిక సదుపాయాల సరిగ్గా లేవని.. అందువల్లే ఈ తరహా ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు అయితే సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజవాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాతా ప్రసాద్ పాండేను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే ఇప్పటి వరకు యూపీ అసెంబ్లీలో సమాజవాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రతిపక్ష నేతగా వ్యవహించారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనౌజ్ నుంచి ఎంపీగా అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యారు.
మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను నయవంచనకు గురి చేసిందంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ నాగరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని నిప్పులు చెరిగారు. గత అయిదేళ్లలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ కుప్ప కూలిపోయాయన్నారు. శాంతి భద్రతలు సైతం క్షీణించాయని తెలిపారు.
వారీస్ పంజాబ్ దే అధ్యక్షుడు, ఖదూర్ సాహెబ్ ఎంపీ అమృత్ పాల్ సింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ చన్నీ మండిపడ్డారు. లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన అమృత్ పాల్ సింగ్‌ను నిర్బందంలో ఉంచడం ఏమిటంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ప్రతిష్టకు భంగం కలిగేంచేలా సోషల్ మీడియాలో వైరలవుతున్న పోస్ట్‌లను తొలగించాలని ఎక్స్ కార్పొరేషన్‌తోపాటు గూగుల్ ఇంటర్నేషనల్ కంపెనీని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై భారతదేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారంటూ నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళలు, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు సమయంలో పెద్దఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయని ‘ఓట్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ నివేదిక ఆరోపించింది.
భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమని.. డబ్బుంటే దాన్ని కొనేయవచ్చని చాలామంది నమ్ముతున్నారని లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది.