Home » Lok Sabha Election 2024
ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రోజు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యాటనలో భాగంగా సాయంత్రం 4.00 గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్‌కు ఆయన చేరుకుంటారు. అనంతరం వారణాసిలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద లబ్దిదారులకు 17 విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్‌ల నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహించాలని, వయనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈవీఎంల భద్రతపై చర్చ సాగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అది తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలతో ఈవీఎంల అంశం
మోదీ ప్రభుత్వం తాజాగా కొలువు తీరింది. కేబినెట్ మంత్రులంతా బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఒక్కటే ఇక మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవి.. ఏ పార్టీ వారిని వరించనుందనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని మదర్ ఇండియా అంటూ తాను చేసిన వ్యాఖ్యలు మీడియా తప్పుగా అర్థం చేసుకుందని త్రిశ్శూర్ ఎంఫీ, కేంద్ర పెట్రోలియం, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి అన్నారు.
ప్రస్తుత సార్వత్రక ఎన్నికల ఓటింగ్‌లో మహిళలు మున్నెన్నడూ లేని విధంగా పాల్గొన్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలూ అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. మహిళా కేంద్రిత సంక్షేమ పథకాల గురించి బీజేపీ ఎంతగా ప్రచారం చేసినప్పటికీ మహిళా ఓటర్ల మద్దతును పొందడంలో బీజేపీ వెనుకబడే ఉన్నది.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సైతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమావేశమయ్యారు. శుక్రవారం చెన్నైలోని తమిళిసై నివాసానికి వెళ్లిన అన్నామలై.. ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం అన్నామలై ఎక్స్ వేదికగా స్పందించారు. తమిళిసైతో భేటీ కావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు. ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టడంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో మోహన్ భగవత్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఎన్నికల ఫలితాల ముందు ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది... ఈ పార్టీ గద్దెనెక్కుతుందంటూ పలు సర్వే సంస్థలు వరుసగా ప్రకటించాయి.
దళితులు జాతీయ పార్టీలకన్నా ప్రాంతీయ పార్టీలవైపు మొగ్గు చూపినట్టు ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఫలితాలపై సీఎ్‌సడీఎస్ సర్వే సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం దళితులు బీజేపీకన్నా ఇతర పార్టీలను ఆదరించారు.