• Home » Liquor Lovers

Liquor Lovers

Crime: భర్తను కొట్టారని భార్య ఆగ్రహం.. నేరుగా వైన్‌షాప్‌కు వెళ్లి..

Crime: భర్తను కొట్టారని భార్య ఆగ్రహం.. నేరుగా వైన్‌షాప్‌కు వెళ్లి..

హైదరాబాద్: మద్యం కొనేందుకు వెళ్లిన తన భర్తపై వైన్ షాపు సిబ్బంది దాడి చేసి తల పగల గొట్టారు. రక్తంతో ఇంటికి వచ్చిన భర్తను చూసిన భార్య ఆగ్రహంతో రెచ్చిపోయింది. వెంటనే కొంతమందిని తీసుకుని వైన్ షాప్‌కు వెళ్లి సిబ్బందిపై దాడి చేసింది. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను జుట్టు పట్టుకుని కొట్టింది.

Lok Sabha Election 2024: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఆందోళనలో మద్యం ప్రియులు

Lok Sabha Election 2024: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఆందోళనలో మద్యం ప్రియులు

తెలంగాణలో మే13న పార్లమెంట్ ఎన్నికలకు (Lok Sabha Election 2024) పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం (Election Commission) 144 సెక్షన్ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మందు బాబులకు కూడా ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు మద్యం షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశించింది.

AP Elections: బాబోయ్.. రూ.10కే రెండు క్వార్టర్లు, 50కే బస్తా బియ్యం!

AP Elections: బాబోయ్.. రూ.10కే రెండు క్వార్టర్లు, 50కే బస్తా బియ్యం!

పది రూపాయలకే రెండు క్వార్టర్‌ బాటిళ్లు.. యాభై రూపాయలకే బియ్యం బస్తా!.. ఓటమి భయంతో ఒంగోలు వైసీపీ అభ్యర్థులు ఓటర్లకు పంచుతున్న తాయిలాల పరంపర ఇది! ఒంగోలు లోక్‌సభ, అసెంబ్లీ వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేతలు ఓటమి భయంతో ఇప్పటికే అనేక రకాలుగా ఓటర్లను మభ్యపెట్టారు. ఇక పోలింగ్‌ దగ్గర పడడంతో ఓటుకు నోటుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో ఓటుకు రూ.3వేలు పంపిణీ చేశారు.

LIQUOR : మద్యం మత్తులో గ్రామాలు

LIQUOR : మద్యం మత్తులో గ్రామాలు

ప్రస్తుతం ఎన్నిల సమయంలో మండలంలోని గ్రామాలు మద్యం మత్తులో తూగుతున్నాయి. ఈ మద్యం మత్తులో కొన్ని గ్రామాల్లో ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక మద్యం గ్రామాల్లో ఏరులైపారుతోందని మండలంలోని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. సెబ్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు సరియైున నిఘా ఉంచడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. అసలే ఎన్నికల సమయం విచ్చలవిడిగా కర్ణాటక మద్యం గ్రామా ల్లోకి వస్తుండ డం తో... దానిని తాగి కొంతమంది అనవ సరమైన గొడవలకు దిగుతున్నారని పలు గ్రా మాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Lok Sabha Polls: ఓటు వెయ్యండి.. మందు బాటిల్‌పై డిస్కౌంట్ పొందండి..

Lok Sabha Polls: ఓటు వెయ్యండి.. మందు బాటిల్‌పై డిస్కౌంట్ పొందండి..

‘బుల్లెట్ కంటే బ్యాలెట్ బలమైనది’.. ‘మార్పు కోరుకోవడం మాత్రమే సరిపోదు.. మీరు వెళ్లి ఓటు వేయడం ద్వారా మార్పు చేసుకోవాలి’.. ‘బలమైన దేశాన్ని సృష్టించేందుకు మీ ఓటు హక్కును వినియోగించుకోండి’ అనే నినాదలు మనకు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అయితే, చాలా మంది ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు.

LIQUOR : భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

LIQUOR : భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.2.45లక్షలు విలువైన మద్యాన్ని మం డలంలోని జాతీయ రహదారిపై పాలసముద్రం కూడలి లో మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్బ రాయుడు తెలిపారు. దానితోపాటు రెండు కార్లు స్వాధీనం చేసుకుని మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పాలసముద్రం కూడలిలో గోరంట్ల పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బెంగుళూరు వైపు నుంచి ఏపీ 02సీహెచ6347 నంబర్‌ గల టాటా ఇండిగో కారు, నంబరు ప్లేట్‌ లేని ఇతియోస్‌ కారులో మ ద్యాన్ని గుర్తించారు.

Liquor Sales: మందు బాబులకు బిగ్ షాక్.. ఉన్నపళంగా వెలసిన బోర్డులు..

Liquor Sales: మందు బాబులకు బిగ్ షాక్.. ఉన్నపళంగా వెలసిన బోర్డులు..

అసలే సమ్మర్.. ఆపై ఎన్నికల సీజన్.. కాస్త చిల్ అవుదామని.. చల్ల చల్లటి బీర్ కొడదామని మందు బాబులు వైన్ షాప్‌కి వెళ్లి బీర్ అడిగితే.. బీర్ గీర్ జాన్తా నై అంటూ వెళ్లగొడుతున్నారు. బ్లాక్‌లో అయినా పర్వాలేదు ఇవ్వన్నా అంటే.. అసలు బీర్లే లేవు సామీ అంటూ సమాధానం ఇస్తున్నారు.

Liquor Lovers: మద్యం ప్రియులకు ఆరు రోజుల వ్యవధిలోనే మరో షాక్..

Liquor Lovers: మద్యం ప్రియులకు ఆరు రోజుల వ్యవధిలోనే మరో షాక్..

మందు బాబులకు మళ్లీ షాక్. ఆరు రోజుల వ్యవధిలోనే మద్యం ప్రియులకు అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. తెలంగాణలో మంగళవారం (ఏప్రిల్ 23) నాడు నగర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17వ తేది నాడు మద్యం షాపులు, వైన్స్ మూసివేసిన విషయం తెలిసిందే. ఆరు రోజులు తిరగకముందే అంటే రేపు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Sara: నాటు రూటు..!

Sara: నాటు రూటు..!

యాడికి మండలంలో నాటు సారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవారికి నాయకులు ‘నాటు’ మంత్రం వేస్తున్నారు. ప్రభుత్వ మద్యం కొనాలంటే ఖర్చు ఎక్కువ. అందుకే.. ఖర్చు తక్కువ.. కిక్కు ఎక్కువ అనుకుని.. పేదల ఆరోగ్యాన్ని పాడు చేసేందుకు పూనుకున్నారు. మరోవైపు జె-బ్రాండ్‌ మద్యం అంతా రాజకీయ నాయకులకే సరిపోతోందని మద్యం ప్రియులు నాటు బాట పట్టారు.

Wine Shops: హైదరాబాద్‌లో 24 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్‌.. కారణమిదే..!?

Wine Shops: హైదరాబాద్‌లో 24 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్‌.. కారణమిదే..!?

ఈ నెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ట్రై కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లుకాంపౌండ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి