Home » Leopard
రాజమండ్రి పరిసర గ్రామాల్లో పెద్ద పులి హడలెత్తిస్తోంది. రోజుకో ప్రాంతం తిరుగుతూ అక్కడి ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. తాజాగా.. రాజనగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో తెల్లవారుజామున పెద్ద పులి ఆవుపై దాడిచేసి చంపేసింది. దీంతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
సంగారెడ్డి జిల్లా జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందన్న వార్తలతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తముతోంది. బసంతపూర్‌లో లేగదూడపై పులి దాడిచేసినట్లు గుర్తించారు. దీంతో ఇక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండాపోతోంది.
జనగామ మండలంలో పెద్దపులి సంచారం వార్తలు స్థానిక ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. జనగామ, పక్కనే ఉన్న యాద్రాది భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక ఏరియాలో పెద్దపులి సంచారం ఉందని తెలుస్తోంది.
ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం వద్ద పెద్దపులి సంచారం మొదలైంది. ఈ పులి రెండు లేగదూడలపై దాడి చేసి చంపింది. దీంతో ఇటుకల కోట ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనను గురవుతున్నారు.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతపులి సంచరిచినట్లు గుర్తించారు. యూనివర్సిటీలోని యూనియన్ బ్యాంక్ వద్ద గత ఐదురోజులక్రితం చిరుత సంచరించిన విషయం అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైంది. అంతేగాక అక్కడి పరిసరాల్లో ఓ జింకను కూడా వేటాడినట్లు గుర్తించారు.
చిరుతపులులు, ఎలుగుబంట్ల సంచారంతో అనంతపురం జిల్లా మడకశిర ఏరియా వాసులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం రొళ్ల మండలం హొట్టెబెట్ట గ్రామ సమీపంలోని కొండలో చిరుత సంచారాన్ని గ్రామస్థులు చూశారు. అలాగే ఎలుగుబంట్లు కూడా సంచరిస్తుండడంతో గ్రామాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందిన వెంటనే టీటీడీ సిబ్బంది అక్కడకు చేరుకుని చిరుత కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
చిరుత సంచారం స్థానికుల్లో భయాందోళన కల్పిస్తోంది. అదానీ సిమెంట్ పరిశ్రమ మైనింగ్ ప్రాంతంలో చిరుతపులి తిరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే.. రోళ్ల మండలంలో కూడా చిరుత పులి సంచారం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ ఏరియాలో చిరుతపులి సంచారం ఉందని, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖాధికారులు తెలుపుతున్నారు. కడలూరు సమీపం అరిసిపెరియంకుప్పం ప్రాంతంలో నయినార్ అనే రైతుకు చెందిన పొలంలో చిరుత కాలిముద్రలను గుర్తించారు.
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, కుందుర్పి మండలాల్లో చిరుతపులుల సంచారంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. కళ్యాణదుర్గం మండల కేంద్రానికి ఓ గ్రానైట్ కొండపై, అలాగే కుందుర్పి మండలం రుద్రంపల్లిలో చిరుతపులులు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.