Home » Lebanon
‘‘తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపుచెక్కతో నే రెండిస్తా’’.. అనే సామెత చందంగా అక్టోబరు 1న ఇరాన్ తమ దేశంపై క్షిపణుల వర్షానికి ప్రతిగా ఇజ్రాయెల్ 100 ఫైటర్ జెట్లతో వెళ్లి తీవ్ర ప్రతిదాడి చేసి విధ్వంసం సృష్టించడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు!
లెబనాన్ రాజధాని బీరుట్‌ను వదిలిపోవాలన్న ఇజ్రాయెల్ హెచ్చరికలతో ప్రజలు పరుగులు తీశారు.
ఇజ్రాయెల్-హెజ్బొల్లాల మధ్య దాడులతో సతమతమవుతోన్న లెబనాన్ ప్రజలకు భారత్ మానవతా సాయం అందించింది.
సంక్షుభిత పరిస్థితుల్లో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు పెద్దఎత్తున ఔషధాలను భారత్ పంపుతోంది. ఇందులో భాగంగా 33 టన్నుల మానవతా సరఫరాలను పంపుతున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
హైఫా నగరానికి సమీపంలోని బిన్యమిన ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్‌బొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడి జరిపింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి నేటికి సరిగ్గా ఏడాది! పగబట్టిన పాములా.. హమాస్ నిర్మూలించడమే లక్ష్యంగా.. సంవత్సర కాలంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సేనలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది!!
సెంట్రల్ గాజా డెయిల్ అల్ బలాహ్ పట్టణంలోని అల్ అక్సా ఆసుపత్రికి సమీపంలో ఉన్న మసీదుపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 26 మంది చనిపోయారు.
హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు మరో భారీ దెబ్బ తగిలింది. గురువారం సిరియాలోని డమాస్క్‌సపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) జరిపిన క్షిపణి దాడుల్లో.. హిజ్బుల్లాకు ఆ యుధాల సరఫరా, నిధుల సమీకరణ వ్యవహారాలను పర్యవేక్షించే హసన్ జాఫర్ అల్-ఖాసిర్ మృతిచెందాడు.
పశ్చిమాసియా భగ్గుమంది..! హమాస్.. హిజ్బుల్లాతో పోరుసల్పుతున్న ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7.30 సమయంలో ఒకసారి.. 8 గంటల సమయంలో మరోసారి బాలిస్టిక్ క్షిపణుల వర్షాన్ని కురిపించింది.
హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ సేనలు.. సోమవారం అర్ధరాత్రి దాటాక లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లాయి. సోమవారం ఉదయం నుంచే అమెరికా వార్తా సంస్థలు సీఎన్‌ఎన్, వాషింగ్టన్ పోస్ట్ తమ వెబ్ ఎడిషన్లలో భూతల దాడులకు సర్వం