• Home » Kutami

Kutami

Nara Lokesh: కూటమి విజయంపై నారా లోకేశ్‌కు అభినందనల వెల్లువ..

Nara Lokesh: కూటమి విజయంపై నారా లోకేశ్‌కు అభినందనల వెల్లువ..

ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లో టీడీపీ, జనసేన, బీజీపీ కూటమి(Kutami) భారీ విజయంతో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు స్వీట్లు పంచుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. 39ఏళ్ల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఘన విజయం సాధించడంపైనా నారా లోకేశ్‌(Nara Lokesh)పై అభినందల వర్షం కురుస్తోంది.

AP Politics: ఏపీ అసెంబ్లీ ఫలితాలపై జనసేన నేత నాగబాబు స్పందన..

AP Politics: ఏపీ అసెంబ్లీ ఫలితాలపై జనసేన నేత నాగబాబు స్పందన..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly Election Results) ఎన్నికల ఫలితాలపై జనసేన నేత నాగబాబు(Nagababu) స్పందించారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భారీ మెజార్టీ అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిలబడిన 21స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలవడం అనేది పవన్ కల్యాణ్‌పై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు.

AP Election Result 2024: ఉత్తరాంధ్రలో ఊడ్చేసి.. కోస్తాలో కుమ్మేసి! సీమలో రచ్చచేసి

AP Election Result 2024: ఉత్తరాంధ్రలో ఊడ్చేసి.. కోస్తాలో కుమ్మేసి! సీమలో రచ్చచేసి

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని గుప్పిటపట్టింది. 13 ఉమ్మడి జిల్లాలకు గాను 8 జిల్లాలు.. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఆ పార్టీ ఖాతాయే తెరవలేదు. మిగతా ఐదు జిల్లాల్లో కడపలో మాత్రమే మూడు సీట్లను గెలుచుకుంది.

AP politics: కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో కొంతమంది ఉన్నతాధికారుల్లో గుబులు..

AP politics: కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో కొంతమంది ఉన్నతాధికారుల్లో గుబులు..

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంతో ఉన్నతాధికారుల్లో టెన్షన్ మెుదలైంది. ఇప్పటికే సీఐడీ చీఫ్ సంజయ్(CID Chief Sanjay) సెలవు(Leave) పెట్టి అమెరికా వెళ్తున్నట్లు సమాచారం. జగన్ హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై తప్పుడు కేసులు నమోదు చేయడంలో సంజయ్ కీలక పాత్ర వహించారు.

AP Politics : కుమ్మేసిన కూటమి

AP Politics : కుమ్మేసిన కూటమి

కుమ్మేసిన కూటమి! మారింది. ఈ అలజడికి వైసీపీ గల్లంతైపోయింది. దెబ్బ అదుర్స్‌... అనిపించింది. 175 నియోజకవర్గాల ఏపీ పొలిటికల్‌ మ్యాప్‌లో ‘ఫ్యాను’ ఆన్‌ అయిన నియోజకవర్గాలను కాగడా పెట్టుకుని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం దాకా ఒకటే పరిస్థితి! జిల్లాలకు జిల్లాలను కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది.

AP Election Counting: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు

AP Election Counting: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ(AP Assembly) ఎన్నికల్లో తమ విజయం తద్యమని కూటమి అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈసారి జరిగిన ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ కూడా అవసరం లేదని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కూటమి తరఫున పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులతో అగ్రనేతలు చంద్రబాబు (Chandrababu), అరుణ్ సింగ్, పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) జూమ్ మీటింగ్ నిర్వహించారు.

AP politics: కుప్పం నియోజకవర్గంలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

AP politics: కుప్పం నియోజకవర్గంలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

రాష్ట్రంలో వైసీపీ మూకల దాడులకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. మాచర్ల, తిరుపతి, తాడిపత్రి ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులపై వేటు వేసింది. అయితే ఈవీఎం, వీవీప్యాట్ పగలకొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకపోవడంతో తమను ఎవరూ ఏం చేయలేరనే భావం వైసీపీ అల్లరి మూకల్లో బాగా పెరిగింది. దీంతో గన్నవరం నియోజకవర్గం సహా రాష్ట్రంలో మరికొన్ని చోట్ల కూటమి శ్రేణులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు.

AP politics: పేట్రేగిపోతున్న వైసీపీ మూకలు.. బెంబేలెత్తుతున్న ఎన్నికల అధికారులు..!

AP politics: పేట్రేగిపోతున్న వైసీపీ మూకలు.. బెంబేలెత్తుతున్న ఎన్నికల అధికారులు..!

రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా వైసీపీ(YSRCP) మూకలు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ప్రతిపక్షాలపై ఇష్టారాజ్యంగా దాడులు చేసిన అధికార పార్టీ శ్రేణులు... తాజాగా అధికారులపైనా తమ జులుం ప్రదర్శిస్తున్నారు. కొంతమంది ఎన్నికల అధికారులు వైసీపీ నేతలకు అనుకూలంగా ఉన్నారనే వాదనలు కూటమి నేతలు బలంగా వినిపిస్తున్నారు. అయితే తమ మాట వినని అధికారులపై బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని... వీరి ఒత్తిళ్లు తట్టుకోలేక అధికారులు సెలవులు తీసుకుంటున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు.

AP politics: సీఎస్‌గా జవహర్ రెడ్డి ఉంటే ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరగదు: దేవినేని ఉమా

AP politics: సీఎస్‌గా జవహర్ రెడ్డి ఉంటే ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరగదు: దేవినేని ఉమా

ఆంధ్రప్రదేశ్ సీఎస్ జహవర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. సీఎస్‌గా జవహర్ రెడ్డి ఉంటే ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరగదని, వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించాలన్నారు. సీఎస్, అతని కుమారుడు భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. వారి భూదందాలను సాక్షాధారాలతో సహా బయటపెట్టామన్నారు. సీఎస్‌గా ఉండే అర్హత ఆయన కోల్పోయారని మండిపడ్డారు.

BJP state president Purandeshwari: కూటమి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు: పురందేశ్వరి

BJP state president Purandeshwari: కూటమి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు: పురందేశ్వరి

అమరావతి మే 24: జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల అనంతరం కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉందని పలు విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె వెబ్ ఎక్స్ వీడియో మాధ్యమం ద్వారా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి